- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
YS Jagan:రాష్ట్ర ప్రజలకు మాజీ సీఎం జగన్ కీలక పిలుపు
ఏపీ(Andhra Pradesh)లో ఎన్డీయే కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టి రేపటి(జూన్ 4)కి ఏడాది పూర్తి కానుంది

దిశ,వెబ్‌డెస్క్: ఏపీ(Andhra Pradesh)లో ఎన్డీయే కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టి రేపటి(జూన్ 4)కి ఏడాది పూర్తి కానుంది. ఈ క్రమంలో వైఎస్సార్సీపీ(YSRCP) కూటమి ప్రభుత్వం(AP Government) ఈ ఏడాదిలో రాష్ట్రానికి చేసేందేమి లేదని, ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు మరిచారని విమర్శలు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రేపు(జూన్ 4) వెన్నుపోటు దినోత్సవం నిర్వహిస్తామని వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ పేర్కొన్నారు.
ఈ క్రమంలో సీఎం చంద్రబాబు(CM Chandrababu) పాలనలో ప్రజలకు సంక్షేమం దూరమైందని వైఎస్ జగన్(Former CM YS Jagan) ఆరోపించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే విధ్వంసం సృష్టిస్తుందని.. అక్రమంగా కేసులు పెట్టి వేధిస్తున్నారని ఆయన మండిపడ్డారు. ఈ క్రమంలో తమ ప్రభుత్వ హయాంలో తీసుకొచ్చిన పథకాలను రద్దు చేశారని తెలిపారు. కానీ.. కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ఇప్పటి వరకు అమలు చేయలేదని విమర్శించారు. ఇలాంటి పాలనను ప్రజలు కోరుకోవడం లేదన్నారు. ఈ క్రమంలో రేపు(బుధవారం) వెన్నుపోటు దినోత్సవానికి మద్ధతుగా రాష్ట్ర ప్రజలు తరలి రావాలని మాజీ సీఎం వైఎస్ జగన్ పిలుపునిచ్చారు.






