అమరావతిలో అవినీతికి అంతేలేకుండా పోయింది: మాజీ సీఎం జగన్ సంచలన వ్యాఖ్యలు

by Vemula.Srinu Prasad |

అమరావతిలో అవినీతికి అంతేలేకుండా పోయిందని మాజీ సీఎం జగన్ అన్నారు..

అమరావతిలో అవినీతికి అంతేలేకుండా పోయింది: మాజీ సీఎం జగన్ సంచలన వ్యాఖ్యలు
X

దిశ, వెబ్ డెస్క్: అమరావతి(Amaravati)లో అవినీతి(Corruption)కి అంతేలేకుండా పోయిందని మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి(Former CM Jagan Mohan Reddy) సంచలన ఆరోపణలు చేశారు. ఆ ప్రాంతంలో కడుతున్న కట్టడాల్లో అవినీతికి పాల్పడుతున్నారని ఆరోపించారు. చదరపు అడుగుకు రూ. 4 వేలు పెడితే ఫైవ్ స్టార్ సదుపాయాలు వస్తాయని, కానీ రూ. 10 వేలు పెడుతున్నారని వ్యాఖ్యానించారు. 10 శాతం కాంట్రాక్టు ఇచ్చి 8 శాతం కమీషన్ వసూలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక్క అమరావతిలోనే కాదని, అన్ని రంగాల్లో కమిషన్లు తీసుకుంటున్నారని మండిపడ్డారు. మట్టి, గ్రావెల్, మైనింగ్, కంపనీలు పెట్టాలన్నా కూటమి నాయకులకు కమిషన్లు ఇవ్వాల్సిందేనన్నారు. ఈ అవినీతికి పోలీసులు సైతం సహకరిస్తున్నారని జగన్ వ్యాఖ్యానించారు.

వైసీపీ లీగల్ సెల్ ప్రతినిధులతో సమావేశమైన జగన్.. లిక్కర్ కేసుపై కీలక వ్యాఖ్యలు చేశారు. అక్రమంగా కేసులు ఎదుర్కొంటున్న పార్టీ నేతలను వైసీపీ లీగల్ సెల్ న్యాయ సహాయం చేస్తుందని తెలిపారు. రాష్ట్రంలో ఏ మూలన కూడా న్యాయమనేది కనిపించడంలేదని విమర్శించారు. సీఎం చంద్రబాబు నాయుడు(Cm Chandrababu Naidu) కలియుగ రాజకీయాలు చేస్తున్నారన్నారు. కక్ష సాధింపులతో అక్రమ కేసులు పెట్టి వైసీపీ నేతలను బెదిరించి మరీ వాంగ్మూలాలు తీసుకుంటున్నారని ఆరోపించారు. లా అండ్ ఆర్డర్ విషయంలో కూటమి ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని వైఎస్ జగన్ విమర్శించారు.

Next Story