- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మహానాడు ఎఫెక్ట్.. జగన్ సంచలన నిర్ణయం..!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో TDP మహానాడు 2025 ( Mahanaadu) కార్యక్రమంలో జరుగుతున్న నేపథ్యంలో... వైయస్ జగన్మోహన్ రెడ్డి (

దిశ, వెబ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో TDP మహానాడు 2025 ( Mahanaadu) కార్యక్రమంలో జరుగుతున్న నేపథ్యంలో... వైయస్ జగన్మోహన్ రెడ్డి ( YS Jaganmohan Reddy) కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇవాళ స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులతో జగన్మోహన్ రెడ్డి అత్యవసరంగా సమావేశం నిర్వహించబోతున్నారు. టిడిపి మహానాడు కొనసాగుతున్న నేపథ్యంలో..... కిందిస్థాయి క్యాడర్ను అలెర్ట్ చేయబోతున్నారు జగన్మోహన్ రెడ్డి.
డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మండపేట మున్సిపాలిటీ, అన్నమయ్య జిల్లా మదనపల్లి మున్సిపాలిటీ, కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం గొల్లప్రోలు నగర పంచాయతీ వైసిపి స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులతో... జగన్ సమావేశం అవుతారు. ఈ సమావేశంలో శ్రీ సత్య సాయి జిల్లా పెనుగొండ మండలం వైసీపీ స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులు ( Public representatives of local bodies) కూడా హాజరుకానున్నారు.
ఈ సందర్భంగా... గ్రౌండ్ స్థాయిలో వైసీపీ పార్టీని బలోపేతం చేసేలా... స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులకు దిశా నిర్దేశం చేయనున్నారు. ఈ సమావేశం అనంతరం టిడిపి నిర్వహిస్తున్న మహానాడుకు కూడా కౌంటర్ ఇవ్వబోతున్నారు జగన్. కిందిస్థాయి లీడర్లు కౌంటర్ ఇస్తే... సరిపోదని నేరుగా జగన్మోహన్ రెడ్డి రంగంలోకి దిగుతున్నారు.






