మీది దౌర్భాగ్యపు ప్రభుత్వం కాదా?: జగన్ మోహన్ రెడ్డి

by Vemula.Srinu Prasad |

మీది దౌర్భాగ్యపు ప్రభుత్వం కాదా అని సీఎం చంద్రబాబును మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి ప్రశ్నించారు...

మీది దౌర్భాగ్యపు ప్రభుత్వం కాదా?: జగన్ మోహన్ రెడ్డి
X

దిశ, వెబ్ డెస్క్: మీది దౌర్భాగ్యపు ప్రభుత్వం కాదా? అని సీఎం చంద్రబాబును మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి ప్రశ్నించారు. విదేశాల్లో మెడికల్ కోర్సులు పూర్తి రిజిస్ట్రేషన్ నెంబర్ల విషయంలో ఇబ్బందులు పడుతున్న విద్యార్థులు గుంటూరు జిల్లా తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో జగన్‌ను కలిశారు. ఈ సందర్భంగా ఆయన ట్వీట్ చేశారు. విదేశాల్లో మెడికల్‌ కోర్సు పూర్తిచేసిన విద్యార్థులపై పోలీసులతో దాడులు చేయిస్తారా? అంటూ మండిపడ్డారు. ఎన్‌ఎంసీ (NMC) గైడ్‌లైన్స్‌ ప్రకారం వాళ్లంతా ఇక్కడ ఫారిన్‌ మెడికల్‌ గ్రాడ్యుయేషన్‌(FMG) ఎగ్జామ్‌లో ఉత్తీర్ణులైన తరువాత, ఇక్కడే ఇంటర్న్‌షిప్‌ పూర్తి చేసినా, ఎందుకు పర్మినెంట్‌ రిజిస్ట్రేషన్‌ నంబర్‌ ఇవ్వడం లేదని నిలదీశారు. అది కేవలం ఒక ఫార్మాలిటీ అయినా, నెంబర్లు ఇవ్వకుండా ఎందుకు వేధిస్తున్నారని జగన్ ప్రశ్నించారు.

‘‘ఇదేనా మీ పరిపాలన? మీరు చేస్తున్న తప్పులను ఎత్తిచూపితే వారిపై పోలీసులతో దాడులు చేయిస్తారా? గడచిన ఏడాది కాలంగా వారిపై వివక్ష చూపుతూ, ఇంటర్న్‌షిప్‌ పేరుతో దీర్ఘకాలం వెట్టిచాకిరి చేయించుకుంటూ, ప్రైవేటు మెడికల్‌ కాలేజీలకు లాభం చేకూర్చేలా, ఉద్దేశ పూర్వకంగా వీరికి పర్మినెంట్‌ రిజిస్ట్రేషన్‌ (పీఆర్‌) నంబర్‌ ఇవ్వకపోవడం వాస్తవం కాదా? తమ పిల్లలను డాక్టర్లుగా చూడాలని తల్లిదండ్రులు అప్పులు చేసి, ఆస్తులు అమ్మి తమ పిల్లలను విదేశాల‌కు పంపిస్తే, ఆ పిల్లలు కష్టపడి చదువుకుని కోర్సులు పూర్తిచేశారు. అలాంటి వారిని అంటరాని వారిగాచూస్తూ, వారి కెరీర్‌ను నాశనం చేయడం ఎంతవరకు సమంజసం? వారిని నిరుత్సాహపరచాలన్నది మీ ప్లాన్‌లో భాగం కాదా?.’’ అని జగన్ ప్రశ్నించారు.

Ys Jagan Tweet

Next Story