Ap News: మాజీ సీఎం జగన్ తీవ్ర దిగ్భ్రాంతి

by Vemula.Srinu Prasad |

బల్లికురవపాడు ప్రమాదంపై మాజీ సీఎం జగన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు..

Ap News: మాజీ సీఎం జగన్ తీవ్ర దిగ్భ్రాంతి
X

దిశ, వెబ్ డెస్క్: ప్రకాశం జిల్లా బల్లికురవపాడు(Ballikuravapadu)లోని గ్రానైట్ క్వారీ(Granite Quary)లో జరిగిన ప్రమాదంలో ఆరుగురు కార్మికులు మృతి చెందిన విషయం తెలిసిందే. అయితే ఈ ప్రమాదంపై మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి(Former Cm Jagan Mohan Reddy) తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. పొట్టకూటి కోసం కార్మికులు ఒడిశా నుంచి వచ్చి మృతి చెందడం బాధాకరమన్నారు. క్షతగాత్రులకు మెరుగైన చికిత్స అందించాలన్నారు.

కాగా క్వారీలో జరిగిన ప్రమాదంలో 16 మందికి తీవ్రగాయాలు కావడంతో వారందరిని ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం వారికి చికిత్స కొనసాగుతోంది. ప్రమాదంపై పలువురు రాజకీయ ప్రముఖులు సైతం దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

Next Story