YS Jagan : పార్టీ సీనియర్ నేతలతో మాజీ సీఎం జగన్ కీలక భేటీ !

by Y. Venkata Narasimha Reddy |   (  Updated:2025-02-11 12:41:54  IST  )

ఏపీ సీఎం వైఎస్ జగన్(YS Jagan) పార్టీ సీనీయర్ నేతల(Senior Party Leaders)తో సమావేశమయ్యా(Meeting)రు.

YS Jagan : పార్టీ సీనియర్ నేతలతో మాజీ సీఎం జగన్ కీలక భేటీ !
X

దిశ, వెబ్ డెస్క్ : ఏపీ సీఎం వైఎస్ జగన్(YS Jagan) పార్టీ సీనీయర్ నేతల(Senior Party Leaders)తో సమావేశమయ్యా(Meeting)రు. తాడేపల్లి వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన పార్టీ ముఖ్య నేతల సమావేశంలో కూటమి ప్రభుత్వ విధానాలు...రానున్న అసెంబ్లీ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించారు. కూటమి ఎన్నికల హామీల అమలు వైఫల్యాలపై అసెంబ్లీలో, ప్రజాక్షేత్రంలో పోరాటాల నిర్వహణ, పార్టీ సంస్థాగత బలపేతం, వైసీపీ పాలనపై కూటమి చేస్తున్న విమర్శలను తిప్పికొట్డడం వంటి అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా వైఎస్సార్‌సీపీ పంచాయితీరాజ్‌ విభాగం డైరీ 2025ను జగన్ ఆవిష్కరించారు.

గ్రామ స్వరాజ్యం స్ధాపనకు గతంలో వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం తీసుకున్న చర్యలను, స్ధానిక సంస్ధల బలోపేతంతో పాటు ఆర్ధికంగా వాటిని స్వయంసమృద్ది దిశగా తీసుకున్న చర్యలను ఈ సందర్భంగా జగన్ ప్రస్తావించారు. స్ధానిక ప్రజాప్రతినిధులకు వైఎస్సార్‌సీపీ ఎప్పుడూ అండగా ఉంటుందన్నారు.

ఈ సమావేశంలో పార్టీ నేతలు అంబటి రాంబాబు, కొట్టు సత్యనారాయణ, పేర్ని నాని, మజ్జి శ్రీనివాసరావు, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, వైఎస్సార్సీపీ పంచాయితీరాజ్‌ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు వెన్నపూస రవీంద్రరెడ్డి, నాయకులు మల్లాది విష్ణు, గడికోట శ్రీకాంత్‌ రెడ్డి, మజ్జి శ్రీనివాసరావు, వైఎస్సార్‌సీపీ ఎంపీపీ యూనియన్‌ రాష్ట్ర అధ్యక్షుడు మరకపూడి గాంధీ, కడప మాజీ డీసీఎంఎస్‌ ఛైర్మన్‌ విష్ణువర్ధన్‌ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Next Story