మీ చరిత్ర అది: లోకేశ్‌పై జగన్ ఫైర్

by Vemula.Srinu Prasad |

"మాది గూగుల్.. వారిది గొడ్డలి.. బోత్ ఆర్ నాట్ సేమ్ (Both are not the same)" అంటూ విశాఖ గూగుల్ ఏఐ (AI) డేటా సెంటర్ శంకుస్థాపన కార్యక్రమంలో మంత్రి లోకేశ్ చేసిన వ్యాఖ్యలపై మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి తాజాగా స్పందించారు. ..

jagan key orders to ycp party cadre
X

jagan key orders to ycp party cadre

దిశ, వెబ్ డెస్క్: "మాది గూగుల్.. వారిది గొడ్డలి.. బోత్ ఆర్ నాట్ సేమ్ (Both are not the same)" అంటూ విశాఖ గూగుల్ ఏఐ (AI) డేటా సెంటర్ శంకుస్థాపన కార్యక్రమంలో మంత్రి లోకేశ్ చేసిన వ్యాఖ్యలపై మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి తాజాగా స్పందించారు. బోత్‌ ఆర్‌ నాట్‌ సేమ్‌ అని లోకేష్‌ సినిమా డైలాగులు కొడుతున్నాడని, వెన్నుపోటుతో పార్టీని లాక్కుని ప్రభుత్వం ఏర్పాటు చేసిన చరిత్ర వారిదని ఆయన స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. తాము ప్రజామద్దతుతో ప్రభుత్వం ఏర్పాటు చేశామని దీమా వ్యక్తం చేశారు. ప్రజలకు ద్రోహం.. వాడుకోవడం .. వదిలేయడం మీ క్యారెక్టర్‌ అని ఎద్దేవా చేశారు. ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం తమ క్యారెక్టర్‌ అని పనులు చేసి చూపించడం తమ స్టైల్‌.. పబ్లిసిటీ చేయడం వాళ్ల స్టైల్‌ అని విమర్శించారు. బటన్‌ నొక్కి ప్రజలకు డబ్బులు వేసిన చరిత్ర తమదని, రెండేళ్లలో పథకాలు రద్దు చేసిన చరిత్ర కూటమిదని, బోత్‌ ఆర్‌ నాట్‌ సేమ్‌ అని వైఎస్‌ జగన్‌ వ్యాఖ్యానించారు.

Next Story