- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సిగ్గుండాలి.. ఏడన్నా దూకి చావాలి: టీడీపీ నేతలపై వైఎస్ జగన్ ఆగ్రహం
సీఎం చంద్రబాబు నాయుడుపై మాజీ సీఎం జగన్ ఫైర్ అయ్యారు....

దిశ, వెబ్ డెస్క్: బీసీ బిడ్డపై దాడి జరుగుతుంటే వాళ్ల కోసమే పుట్టిన పార్టీ అంటూ నాటకాలడే వాళ్లంతా ఏక్కడికన్నా పోయి దూకి చావాలని మాజీ సీఎం జగన్(Former Cm Jagan) ఆగ్రహం వ్యక్తం చేశారు. గుడివాడలో జరిగిన ఘటనపై ఆయన మండిపడ్డారు. పథకాల అమలులో ప్రభుత్వం విఫలమైతే నిరసనలు వ్యక్తం చేస్తూ కార్యక్రమాలు చేయొద్దా అని ప్రశ్నించారు. బీసీ సోదరిపై టీడీపీ సైకోలు దాడి చేస్తారా అంటూ మండిపడ్డారు. పోలీసుల సమక్షంలోనే దాడు చేయడం హేయమైన చర్య అంటూ ధ్వజమెత్తారు. తన పర్యటనలోనూ పోలీసులు సహకరించలేదన్నారు. రైతులకు సంఘీభావం తెలిపితే తమపైనే కేసులు పెడుతున్నారన్నారు. సత్యసాయి జిల్లా రాయగిరి పర్యటనలో తన హెలీప్యాడ్ వద్ద సరైన భద్రత కల్పించలేదని, పైగా తమపైనే కేసులు పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డిపై కూడా తిరిగి కేసు నమోదు చేశారన్నారు. వైసీపీ వాళ్లను చంపితే వాళ్ల కుటుంబాన్ని పరామర్శించొద్దా అని జగన్ ప్రశ్నించారు.






