- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మావిగన్‌పై వెనక్కి తగ్గని జగన్.. త్వరలో రాష్ట్రవ్యాప్తంగా పాదయాత్ర
రాజధాని అమరావతిపై మాజీ సీఎం, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ మోహన్ రెడ్డి మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు...

దిశ, వెబ్ డెస్క్: రాజధాని అమరావతి(Amaravati)పై మాజీ సీఎం, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ మోహన్ రెడ్డి(Ys Jagan Mohan Reddy) మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. తాను ప్రతిపాదించిన మావిగన్‌కే కట్టుబడి ఉన్నట్లు తెలిపారు. అమరావతినే రాజధాని(Capital) కొనసాగించడం వల్ల ఖర్చు భారీగా అవుతుందని, అదే మావిగన్‌కు చాలా తక్కువ అవుతుందని స్పష్టం చేశారు. ప్లాన్ ఏలో భాగంగా తన హయాంలో మూడు రాజధానులను ప్రతిపాదించామని, ఇప్పుడు ప్లాన్ బి మావిగన్‌ను ప్రతిపాదిస్తున్నామని జగన్ పేర్కొన్నారు.
గ్రోత్ కారిడార్‌గా మావిగన్
మచిలీపట్నం పోర్టు(Machilipatnam)ను తామే ప్రారంభించామని, అందువల్లే మావిగన్‌ను ప్రతిపాదిస్తున్నట్లు జగన్ చెప్పారు. మచిలీపట్నం-విజయవాడ-గుంటూరును కలిపే రాజధాని గ్రోత్ కారిడార్‌గా మావిగన్‌ను సూచించామని జగన్ వెల్లడించారు. అమరావతిలో ఖర్చులు భారీగా పెరిగిపోయాయని, చదరపు అడుగుకు రూ. 14 వేలు ఖర్చు చేస్తారా అని ప్రశ్నించారు. ఇప్పటికే కూటమి ప్రభుత్వం రెండేళ్లలో రూ. 3.52 లక్షల కోట్లు అప్పు చేసిందని ఆరోపించారు. రైతులకు మద్దతు ధర ఇవ్వడంలేదని విమర్శించారు. రాష్ట్ర సమస్యలపై ప్రశ్నించేందుకు తాను త్వరలో పాదయాత్ర చేపట్టబోతున్నట్లు వైఎస్ జగన్ ప్రకటించారు. రాష్ట్ర ప్రజలతో తాము మమేకం అవుతామని ఆయన స్పష్టం చేశారు.






