- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పేదల గురించి ఆలోచించిన ఏకైక వ్యక్తి NTR: చంద్రబాబు
పేదల గురించి ఆలోచించిన ఏకైక వ్యక్తి దివంగత సీఎం ఎన్టీఆర్ అని చంద్రబాబు కొనియాడారు.

X
దిశ, వెబ్‌డెస్క్: పేదల గురించి ఆలోచించిన ఏకైక వ్యక్తి దివంగత సీఎం ఎన్టీఆర్ అని చంద్రబాబు కొనియాడారు. రాజమండ్రిలో జరుగుతోన్న టీడీపీ మహానాడు కార్యక్రమానికి హాజరై చంద్రబాబు ప్రసంగించారు. ఎంతో మంది నాయకులు వచ్చారు.. ఎన్నో పార్టీలు పెట్టారు.. కానీ తెలుగు వారి రుణం తీర్చుకోవడం కోసం ఎన్టీఆర్ తెలుగు దేశం పార్టీని స్థాపించారని అన్నారు. సామాన్య కుటుంబంలో పుట్టి ఎంతో కష్టపడి పైకి ఎదిగిన వ్యక్తి ఎన్టీఆర్ అని ప్రశంసలు కురిపించారు. మహిళలకు రాజకీయ రిజర్వేషన్లు ఇచ్చిన ఘనత ఎన్టీఆర్‌కే దక్కుతుందన్నారు. పేదల కోసం ఎంతో కృషి చేసిన ఎన్టీఆర్.. తెలుగు జాతి ఉన్నంతవరకు ఉంటారన్నారు. క్రీస్తు శకం.. క్రీస్తు పూర్వంలాగా ఎన్టీఆర్ శకం అని చెప్పుకోవాలని వ్యాఖ్యానించారు.
ఇవి కూడా చదవండి:
Mahanadu2023: మహానాడు వేదికగా సీఎం జగన్‌పై బాలకృష్ణ తీవ్ర వ్యాఖ్యలు
Next Story






