Ap: మాజీ సీఐడీ చీఫ్‌కు ఊరట

by Vemula.Srinu Prasad |   (  Updated:2025-01-30 08:57:16  IST  )

మాజీ సీఐడీ సంజయ్‌‌కు హైకోర్టులో ఊరట లభించింది..

Ap: మాజీ సీఐడీ చీఫ్‌కు ఊరట
X

దిశ, వెబ్ డెస్క్: మాజీ సీఐడీ చీఫ్‌కు ఊరట లభించింది. ఆయనకు బెయిల్ మంజూరు అయింది. నిధులు దుర్వినియోగం చేశారనిపై సంజయ్‌పై అభియోలున్నాయి. దీంతో విచారించేందుకు ఏసీబీ రెడీ అయిన సమయంలో హైకోర్టును ఆయన ఆశ్రయించారు. తనకు బెయిల్ మంజూరు చేయాలని కోరారు. ఈ మేరకు విచారణ చేపట్టిన ధర్మాసనం బెయిల్ మంజూరు చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఈ సందర్భంగా పలు వ్యాఖ్యలు చేసింది. ఏసీబీ అధికారుల విచారణకు సహకరించాలని సూచించింది. అలాగే సాక్షులను ప్రభావితం చేయొద్దని తెలిపింది. నిబంధనలు పాటించకపోతే బెయిల్ రద్దు చేస్తామని హెచ్చరించింది.

కాగా మాజీ సీఐడీ చీఫ్ సంజయ్‌(Former CID chief Sanjay)పై ఏపీ ప్రభుత్వం క్రమశిక్షణ చర్యలకు ఆదేశించింది. ఆయన గతంలో అగ్నిమాపక శాఖలో అధికారిగా పని చేశారు. ఆ సమయంలో అధికార, నిధులు దుర్వినియోగానికి పాల్పడినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. ఫోన్ ట్యాబ్‌ల కొనుగోళ్లలలో అవకతవకలకు జరిగాయని, అగ్ని మొబైల్ యాప్‌ను జేబు సంస్థగా వినియోగించారని ఆయనపై విమర్శలు వినిపించాయి. దీంతో ప్రభుత్వం సీరియస్ అయింది. సస్పెండ్ చేసింది. నిబంధనల ఉల్లంఘనపై సంజయ్‌ను వివరణ అడిగింది. నెల సమయం ఇచ్చింది. అయితే ఆయన నుంచి ఎలాంటి స్పందన లేదని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఆయనపై చర్యలకు ఆదేశించింది. దీంతో ఏసీబీ అధికారులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో తనకు బెయిల్ మంజూరు చేయాలని సంజయ్ కుమార్ కోర్టుకు వెళ్లడంతో ఆయనకు కొంత రిలీఫ్ దొరికింది.

అసలు కేసు ఇది..

అగ్నిమాపక శాఖలో నిరభ్యంతర పత్రాలు ఆన్ లైన్‌ ద్వారా జారీ చేయాల్సి ఉంటుంది. ఇందుకోసం అగ్ని-ఎన్వోసిసీ వెబ్ సైట్‌ను, మొబైల్ యాప్ ఏర్పాటు చేశారు. అలాగే వీటి అభివృద్ధి, నిర్వహణతో పాటు 150 ట్యాబ్‌ల సరఫరా కోసం సౌత్రికా టెక్కాలజీస్ అండ్ ఇన్ ఫ్రా సంస్థకు కాంట్రాక్టును అప్పగించారు. అయితే ఈ సంస్థ ద్వారా ఎలాంటి పనులు జరగలేదు. కానీ రూ.55.93 లక్షలను ఆ సంస్థకు సంజయ్ చెల్లించారు. ఎస్సీ, ఎస్టీ ఎట్రాసిటీ నిరోధక చట్టంపై అవగాహన కల్పించే క్రిత్వ్యాప్ టెక్నాజీస్‌కు కాంట్రాక్టును అప్పగించారు. ఇందుకోసం రూ.1.19 కోట్లు చెల్లించారు.

అయితే సదస్సులన్నీ సీఐడీ అధికారులే నిర్వహించడంతో అనుమానాలు వ్యక్తమయ్యాయి. విచారణలో క్రిత్వ్యాప్ సంస్థ నిర్వహించలేదని వెల్లడైంది. బిల్లులు దోచుకున్నట్లు గుర్తించారు. విచారణలో రూ. 2 కోట్ల మేర ప్రభుత్వ ఖజనాకు సంజయ్ నష్టం కలిగించారని తేలింది. దీంతో సంజయ్‌పై ఏసీబీ కేసు నమోదు చేసింది. ప్రభుత్వం కూడా సీరియస్ అయి ఆయననను ఉద్యోగం నుంచి తొలగించింది. ప్రస్తుతం ఈ కేసులో బెయిల్ కావడంతో సంజయ్‌కు బిగ్ రిలీఫ్ లభించినట్లైంది.

Next Story