- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
‘తప్పుగా భావించకండి.. నా మద్దతు ఆల్రెడీ ప్రకటించేశాను’: ఉపరాష్ట్రపతి అభ్యర్థికి జగన్ రిప్లై
by Gantepaka Srikanth |
వైసీపీ అధినేత, ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్(YS Jagan)కు ఇండియా కూటమి ఉపరాష్ట్రపతి అభ్యర్థి సుదర్శన్ రెడ్డి(Sudarshan Reddy) ఫోన్ చేశారు.

X
దిశ, వెబ్‌డెస్క్: వైసీపీ అధినేత, ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్(YS Jagan)కు ఇండియా కూటమి ఉపరాష్ట్రపతి అభ్యర్థి సుదర్శన్ రెడ్డి(Sudarshan Reddy) ఫోన్ చేశారు. ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో తనకు మద్దతు ఇవ్వాలని కోరారు. ‘ఇండియా కూటమి అభ్యర్థి ప్రకటించేలోపే ఎన్డీఏ నేతలకు మద్దతు ఇస్తానని మాట ఇచ్చాను.. మీకు మద్దతు ఇవ్వలేకపోతున్నందుకు తప్పుగా భావించద్దు’ అని సుదర్శన్ రెడ్డితో జగన్ చెప్పారు. ఇదిలా ఉంటే.. జస్టిస్ సుదర్శన్ రెడ్డి ఆదివారం మధ్యాహ్నం హైదరాబాద్‌కు వచ్చారు. మధ్యాహ్నం 2 గంటలకు శంషాబాద్ ఎయిర్ పోర్టులో ఆయనకు కాంగ్రెస్ ఎంపీలు, నాయకులు స్వాగతం పలికారు. అలాగే రేపు సోమవారం మధ్యాహ్నం 12 గంటలకు సుదర్శన్ రెడ్డి ప్రెస్ మీట్ బంజారాహిల్స్‌లోని తాజ్ కృష్ణ హోటల్‌లో ఉంటుందని కాంగ్రెస్ ఎంపీలు నాయకులు తప్పకుండా పాల్గొనాలని మహేష్ కుమార్ గౌడ్ కోరారు.
Next Story






