- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
SKill Case: ఆ హాలులోనే చంద్రబాబు కస్టడీ విచారణ
by Vemula.Srinu Prasad |
చంద్రబాబును సీఐడీ అధికారులు రాజమండ్రి సెంట్రల్ జైలులోనే రెండు రోజుల పాటు ప్రశ్నించనున్నారు....

X
దిశ, వెబ్ డెస్క్: స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబును ఏసీబీ కోర్టు కస్టడీకి ఇచ్చిన విషయం తెలిసిందే. దీంతో చంద్రబాబును సీఐడీ అధికారులు రాజమండ్రి సెంట్రల్ జైలులోనే రెండు రోజుల పాటు ప్రశ్నించనున్నారు. ఇందుకు కోసం జైలులో అన్ని ఏర్పాట్లు చేశారు. అధికారుల విచారణకు వీలుగా జైలులో కాన్ఫరెన్స్ హాలును సైతం సిద్ధం చేశారు. ఈ హాలులో మొత్తం 25 మంది కూర్చునేలా ఏర్పాట్లు చేశారు. ఈ బాధ్యతలను జైలు డిప్యూటీ సూపరింటెండెంట్‌కు అప్పగించారు. సీఐడీ ఇచ్చిన సమాచారంతో భద్రత ఏర్పాట్లను ఎస్పీ సైతం పర్యవేక్షిస్తున్నారు. ఈ మేరకు కోర్టు నుంచి సూపరింటెంటెండ్ కార్యాలయానికి సమాచారం అందజేశారు.
Next Story






