దిప్పకాయలపాడు పరిసరాల్లో పెద్దపులి సంచారం.. మొక్కజొన్న తోటలో తిష్ట

by Vemula.Srinu Prasad |

దిప్పకాయలపాడు పరిసరాల్లో పెద్దపులి సంచారం సంచరిస్తున్నట్లు అటవీశాఖ అధికారులు గుర్తించారు...

దిప్పకాయలపాడు పరిసరాల్లో పెద్దపులి సంచారం.. మొక్కజొన్న తోటలో తిష్ట
X

దిశ, వెబ్ డెస్క్: ఏలూరు జిల్లా(Eluru District) వాసులను గడగడలాడిస్తున్న పెద్దపులి(Tiger) ఎక్కడ ఉందో తెలిసిపోయింది. కొంతకాలంగా పరిసరాల్లో సంచరిస్తూ ఆవు(Cow)లపై దాడి చేసి చంపుతోంది. దీంతో స్థానికులు భయాందోళనలకు గురయ్యారు. దీంతో అటవీ శాఖ(Forest Department) అధికారులు రంగంలోకి దిగారు. డ్రోన్ల ద్వారా పెద్దపులి కదలికలను గుర్తించారు. ప్రస్తుతం పెద్దపులి ఏలూరు జిల్లా కొయ్యాలగూడెం మండలం కన్నాపురం సమీపంలోని దిప్పకాలయపాడులో సంచరిస్తోంది. రైతు కామినేని ఆనందరావుకు చెందిన ఆయిల్ ఫామ్ తోటలో ఆవులపై దాడి చేసింది. ఓ ఆవును చంపి మరో ఆవుకు తీవ్రంగా గాయం చేసింది. అనంతరం సమీపంలోని మొక్క జోన్న తోటలోకి వెళ్లింది. అక్కడే తిష్ట వేసింది. దీంతో పెద్దపులిని బంధించేందుకు అటవీ అధికారులు రంగం సిద్ధం చేశారు. అప్పటి వరకూ ఆ వైపునకు ప్రజలెవరూ వెళ్లొద్దని సూచించారు.

బిల్లిమిల్లి ప్రాంతంలోనూ...


అంతకుముందు బిల్లిమిల్లి ప్రాంతంలో రైతు వివేకానంద ఆయిల్ పామ్ తోటల్లో గేదెపై దాడి చేసింది. కొన్ని రోజులుగా ఈ పులి బుట్టాయిగూడెం మండలంలోని గిరిజన ప్రాంతాల్లో సంచరిస్తోంది. తాజాగా కొయ్యలగూడెం మండలంలోకి ప్రవేశించడంతో అటవీ శాఖ అధికారులు డ్రోన్ల ద్వారా పెద్దపులిని గుర్తించారు. ఈమేరకు అప్రమత్తత ప్రకటించారు.

Next Story