- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Tirumala:శ్రీవారి మెట్టు మార్గంలో చిరుత సంచారం.. స్పందించిన అటవీశాఖ అధికారి
కలియుగ దైవం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని నిత్యం వేలాది మంది భక్తులు(Devotees) దర్శించుకుంటారు

దిశ,వెబ్‌డెస్క్: కలియుగ దైవం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని నిత్యం వేలాది మంది భక్తులు(Devotees) దర్శించుకుంటారు. ఇక వేసవి నేపథ్యంలో తిరుమల(Tirumala)లో భక్తుల రద్దీ ఎక్కువగా ఉండటంతో టీటీడీ(TTD) అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. అయితే ఇటీవల తిరుమల ఘాట్ రోడ్డులో, అలిపిరి మెట్టు మార్గంలో చిరుత సంచారం భక్తులను తీవ్ర ఆందోళనకు గురి చేసింది. ఇదిలా ఉంటే.. శ్రీవారి మెట్టు మార్గంలో ఇవాళ(ఆదివారం) ఉదయం చిరుత సంచరించినట్లు వార్తలు వచ్చాయి.
ఈ నేపథ్యంలో ఇవాళ చిరుత సంచరించిందనే వార్తల పై అటవీశాఖ ఎఫ్ఆర్‌వో దొరైస్వామి స్పందించారు. ఆ వార్తలు పూర్తిగా అవాస్తవమని తెలిపారు. చిరుత సంచరించినట్లు జరిగిన ప్రచారం తప్పుడు ప్రచారం అని ఆయన స్పష్టం చేశారు. ఈ మార్గంలో చిరుత రాలేదని అన్నారు. భక్తులు ఎప్పటి విధంగానే, యథావిధిగా దర్శనాలకు వెళుతున్నట్లు తెలిపారు. అయితే.. నిన్న(శనివారం) సాయంత్రం శిలాతోరణం వద్ద చిరుత కనిపించిందని తర్వాత అది అడవుల్లోకి వెళ్లిందని తెలిపారు. కొందరు భక్తులు ఈ రోజు(ఆదివారం) ఉదయం శ్రీవారి మెట్టు మార్గంలో 500వ మెట్టు వద్ద పక్కనే ఉన్న చెట్ల పొదల్లో చిరుత సేద తీరుతూ కనిపించినట్లు సెక్యూరిటీ సిబ్బందికి సమాచారం ఇచ్చిన విషయం తెలిసిందే.






