Jawan: దేశ సైన్యానికి దైవబలం కోసం.. జనసేన పూజలు

by Thanuru Gopichand |

‘ఆపరేషన్‌ సిందూర్‌’ తో పాకిస్థాన్‌కు గట్టి గుణపాఠం చెప్పిన మన దేశ సైన్యానికి, నాయకత్వానికి దైవబలం మెండుగా ఉండాలని కోరుతూ షష్ట షణ్ముఖ క్షేత్రాలు, ఇతర ఆలయాల్లో జనసేన నేతలు ప్రత్యేక పూజలు నిర్వహించారు.

Jawan: దేశ సైన్యానికి దైవబలం కోసం.. జనసేన పూజలు
X

దిశ, డైనమిక్ ​బ్యూరో : ‘ఆపరేషన్‌ సిందూర్‌’ తో పాకిస్థాన్‌కు గట్టి గుణపాఠం చెప్పిన మన దేశ సైన్యానికి, నాయకత్వానికి దైవబలం మెండుగా ఉండాలని కోరుతూ షష్ట షణ్ముఖ క్షేత్రాలు, ఇతర ఆలయాల్లో జనసేన నేతలు ప్రత్యేక పూజలు నిర్వహించారు. మంగళవారం విజయవాడ ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మకు మంత్రి నాదెండ్ల మనోహర్‌, (Nadendla manohar) ఎమ్మెల్సీ హరిప్రసాద్‌ ప్రత్యేక పూజలు చేశారు. కర్ణాటకలోని ఘాటీ సుబ్రహ్మణ్య క్షేత్రంలో రాజానగరం ఎమ్మెల్యే బ త్తుల బలరామకృష్ణ ఆధ్వర్యంలో నేతలు అర్చన, అభిషేకాలు, కల్యాణోత్సవం నిర్వహించారు. దేశ సైన్యానికి దైవబలం మెండుగా ఉండాలని ప్రార్థించారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు షష్ట షణ్ముఖ క్షేత్రాల దర్శ నంలో భాగంగా బిక్కవోలులోని శ్రీ కుమార సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించడం కోసం బస్సులో మంత్రి కందుల దుర్గేష్ (Durgesh) బయలు దేరారు.

Next Story