రెస్టారెంట్లు, హోటళ్లలో ఫుడ్ తింటున్నారా.. మీకు బిగ్ షాక్.. అసలేం జరిగిందో తెలుసుకోండి..?

by Vemula.Srinu Prasad |

విశాఖలో రెస్టారెంట్లు, హోటళ్లలో ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు చేశారు. ..

రెస్టారెంట్లు, హోటళ్లలో ఫుడ్ తింటున్నారా.. మీకు బిగ్ షాక్.. అసలేం జరిగిందో తెలుసుకోండి..?
X

దిశ, వెబ్ డెస్క్: ఫుడ్ తిందామనే ఆశతో రెస్టారెంట్లు, హోటళ్లకు వెళ్తాన్నారా.? అయితే తమ ఆరోగ్యం చెడిపోయినట్టే. వెజ్, నాన్ వెజ్ రుచికరంగా ఉందా లేదా అని చూస్తున్నారు గాని నాణ్యంగా ఉందా లేదా అని చూడంలేదు. దీన్నే అసరా చేసుకుని రెస్టారెంట్లు, హోటళ్ల నిర్వాహకులు అడ్డమైన తిండిని పెడుతున్నాయి. ఈ విషయాన్ని గమనించకుండా టెస్టీగా ఉంటున్నాయిలే అని నచ్చినంత, కడుపు పట్టినంత లాగించేస్తున్నారు. అంతకు తగ్గ బిల్లు చెల్లిస్తున్నారు. కానీ డబ్బులు ఇచ్చి అనారోగ్యం పాలవుతున్నారనే విషయం మీకు తెలుసా..? ఇలాంటి నాణ్యత లేని ఫుడ్ తిన్ని కొన్ని రోజులకు అనారోగ్యాల బారిన పడుతున్నారు. దీనంతటికి రెస్టారెంట్లు, హోటళ్లే కారణమని, నాణ్యమైన ఫుడ్ తినకపోవడంవల్లేనని ఎప్పుడు తెలుసుకుంటారు.? విశాఖలో తాజాగా జరిగిన ఈఘటనను చూసైనా బయట ఫుడ్ ఎంత డేంజరో తెలుసుకోండి.


విశాఖ(Visakha)లో రెస్టారెంట్లు, హోటళ్లలో ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు చేశారు. అయితే వీరికి విస్తుపోయే దృశ్యాలు కనిపించాయి. క్వాలిటీలేని ఫుడ్ విక్రయిస్తున్నారు. కుళ్లిన చికెన్, గడ్డ కట్టిన చేపలు, మాగిపోయిన పీతలు, ముద్దైపోయిన రొయ్యలు దర్శనమిచ్చాయి. 15 రోజుల నుంచి నిల్వ ఉంచిన మసాలా ముద్దలను అధికారులు గుర్తించారు. పాయిజన్ అయిన ఫుడ్‌ను కస్టమర్లకు అందిస్తున్నట్లు అధికారులు నిర్దారించారు. దీంతో రెస్టారెంట్లు హోటళ్ల నిర్మహకులపై అధికారులు సీరియస్ అయ్యారు. ప్రజల ఆరోగ్యాలతో చెలగాటమడటంపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

Next Story