తిరుమలలో ఆహార నాణ్యత టెస్టింగ్ ల్యాబ్ ప్రారంభం

by Muthe.Rajitha |

తిరుమల తిరుపతి దేవస్థానం(TTD) ఆధ్వర్యంలో తిరుమలలో ఆహార నాణ్యత పరీక్షల ల్యాబ్‌ను టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు(BR Naidu) ప్రారంభించారు.

తిరుమలలో ఆహార నాణ్యత టెస్టింగ్ ల్యాబ్ ప్రారంభం
X

దిశ, వెబ్ డెస్క్ : తిరుమల తిరుపతి దేవస్థానం(TTD) ఆధ్వర్యంలో తిరుమలలో ఆహార నాణ్యత పరీక్షల ల్యాబ్‌ను టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు(BR Naidu) ప్రారంభించారు. ఈ ల్యాబ్ ద్వారా తిరుమలలో భక్తులకు అందించే ప్రసాదాలు, అన్నప్రసాదం, ఇతర ఆహార పదార్థాల నాణ్యతను సమర్థవంతంగా పరీక్షించవచ్చు. దీనివల్ల ఆహార ప్రమాణాలు మరింత సమర్థవంతంగా నిర్వహించబడతాయి. కాగా ఈ ల్యాబ్‌లోని అధునాతన యంత్రాలను నేషనల్ డైరీ డెవలప్‌మెంట్ బోర్డ్ (NDDB) విరాళంగా అందించింది.

టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు మాట్లాడుతూ... ఈ ల్యాబ్ భక్తులకు సురక్షితమైన, నాణ్యమైన ప్రసాదాలను అందించడంలో కీలక పాత్ర పోషిస్తుందని పేర్కొన్నారు. త్వరలో ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (FSSAI) గుర్తింపు పొందిన ల్యాబ్‌ను కూడా ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. ఈ FSSAI ల్యాబ్ ఆహార నాణ్యత పరీక్షలలో జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా పనిచేస్తుంది.

Next Story