ఫుడ్ పాయిజన్.. 11 మంది విద్యార్థులకు అస్వస్థత

by Vemula.Srinu Prasad |   (  Updated:2025-04-04 17:05:54  IST  )

తిరుపతిలో ఫుడ్ పాయిజన్ ఘటన కలకలం రేపింది..

ఫుడ్ పాయిజన్.. 11 మంది విద్యార్థులకు అస్వస్థత
X

దిశ, వెబ్ డెస్క్: తిరుపతి(Tirupati)లో ఫుడ్ పాయిజన్(Food Poison) ఘటన కలకలం రేపింది. చిల్లకూరులోని చిల్డ్రన్స్ హోం(Chillakuru Children)లో భోజనం తిన్న విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. కడుపులో నొప్పి, వాంతులతో బాధ పడ్డారు. దీంతో వారందరిని ఆస్పత్రికి తరలించారు. మిగిలిపోయిన బిర్యానీని టిఫెన్‌గా పెట్టడం వల్ల అస్వస్థతకు గురైనట్లు విద్యార్థులు చెబుతున్నారు. విషయం తెలుసుకున్న సబ్ కలెక్టర్ రాఘవేంద్ర మీనా విద్యార్థులను పరామర్శించారు. విద్యార్థుల ఆరోగ్యంపై ఆరా తీశారు. ఘటనపై విచారణకు ఆదేశించారు. సమగ్ర రిపోర్టు ఇవ్వాలని అధికారులకు సూచించారు. విచారణ అనంతరం చర్యలు తీసుకుంటామని, ప్రస్తుతం విద్యార్థుల ఆరోగ్య పరిస్థితి బాగానే ఉందని సబ్ కలెక్టర్ రాఘవేంద్ర తెలిపారు.

Next Story