- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఇంజినీరింగ్ కళాశాలలో ఫుడ్ పాయిజన్.. ఆందోళనకరంగా ఏడుగురి పరిస్థితి
ఇంజినీరింగ్ కళశాల హాస్టల్‌లో ఫుడ్ పాయిజన్ కావడంతో 26 మంది ఇంజనీరింగ్ విద్యార్థులు అస్వస్థతకు గురైన ఘటన అనంతపురం జిల్లాలో చోటు చేసుకుంది.

X
దిశ, వెబ్‌డెస్క్: ఇంజినీరింగ్ కళశాల హాస్టల్‌లో ఫుడ్ పాయిజన్ కావడంతో 26 మంది ఇంజినీరింగ్ విద్యార్థులు అస్వస్థతకు గురైన ఘటన అనంతపురం జిల్లాలో చోటు చేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళ్లితే.. అనంతపురం జిల్లా బుక్కరాయసముద్రం పరిధిలోని ఎస్ఆర్ఐటీ ఇంజినీరింగ్ కళశాలలో మంగళవారం రాత్రి పెరుగన్నం, టమాటా రైస్, గుడ్డు తిన్నా విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో వెంటనే వారిని అనంతపురంలోని అమరావతి ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వీరిలో ఏడురుగురి పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు డాక్టర్లు తెలిపారు. వారితో పాటు మరికొంతమంది విద్యార్థులు స్వల్ప అస్వస్థతకు గురవ్వడంతో వారికి హాస్టల్‌లోనే చికిత్స అందింస్తున్నట్లు తెలుస్తుంది. కాగా ఈ ఘటనపై పూర్తి వివరాలు ఇంకా తెలియరాలేదు.
Also Read.
Next Story






