మరో ఫుడ్ పాయిజన్ ఘటన.. ఈసారి 10 మంది విద్యార్థులు ఆస్పత్రిపాలు

by Vemula.Srinu Prasad |   (  Updated:2025-11-28 13:48:02  IST  )

కడప జిల్లా ప్రొద్దుటూరు మున్సిపల్ పాఠశాలలో ఫుడ్ పాయిజన్ అయింది....

మరో ఫుడ్ పాయిజన్ ఘటన.. ఈసారి 10 మంది విద్యార్థులు ఆస్పత్రిపాలు
X

దిశ, వెబ్ డెస్క్: రాష్ట్రంలో ఇటీవల కాలంలో ప్రభుత్వ పాఠశాలల పని తీరుపై విమర్శలు కురుస్తున్నాయి. విద్యార్థులకు ప్రభుత్వం భోజనం పెడుతోంది. దీంతో విద్యార్థులు అన్నం తింటుతున్నారు. కానీ నాణ్యతను విస్మరిస్తోంది. ఫలితంగా విద్యార్థులు ఆస్పత్రిపాలు అవుతున్నారు. ఇలాంటి ఘటన రాష్ట్రంలో తరచూ నమోదు అవుతున్నాయి.

తాజాగా కడప జిల్లా ప్రొద్దుటూరు మున్సిపల్ పాఠశాలలో ఫుడ్ పాయిజన్ అయింది. మధ్యాహ్న భోజనం తిన్న 10 మంది విద్యార్థులు వాంతులు, కడుపు నొప్పితో బాధపడ్డారు. దీంతో వారందరిని స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. ప్రస్తుతం విద్యార్థుల ఆరోగ్యం నిలకడగానే ఉంది. కానీ ఘటనపై విద్యార్థులు తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వంట ఏజెన్సీ నిర్వాహకుల నిర్లక్ష్యం వల్లే విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారని, వెంటనే వారిపై యాక్షన్ తీసుకోవాలని డిమాండ్ చేశారు.

అయితే పాఠశాలలో మధ్యాహ్న భోజనం వడ్డించే సమయంలో పప్పు దుర్వాసన వచ్చిందని, టీచర్లకు చెప్పామని విద్యార్థులు తెలిపారు. అప్పటికే భోజనం తిన్న తోటి విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారని తెలిపారు.

Next Story