యూరియా కష్టాలు.. సచివాలయాల ఎదుట రైతుల ఆందోళన

by Vemula.Srinu Prasad |   (  Updated:2025-08-29 08:26:44  IST  )

రాష్ట్రంలో అన్నదాతలు రోడ్డు బాట పట్టారు...

యూరియా కష్టాలు.. సచివాలయాల ఎదుట రైతుల ఆందోళన
X

దిశ, వెబ్ డెస్క్: రాష్ట్రంలో అన్నదాతలు(Farmers) రోడ్డు బాట పట్టారు. రైనీ సీజన్(Rainysession) వచ్చినా దుక్కి దున్నేందుకు పాట్లు పడాల్సిన వస్తోంది. పంట పండించేందుకు సిద్ధంగా ఉన్నా అందుకు సహకారం లేదు. దీంతో యూరియా(Urea) కోసం అన్నదాత ఎదురు చూపులు చూడాల్సిన పరిస్థితి నెలకొంది. పొద్దున్నే లేచి వెళ్లి యూరియా కోసం గ్రామ సచివాలయాల(Secretariat) వద్ద పడిగాపులు కాస్తున్నారు. రాష్ట్రంలో చాలా ప్రాంతాల్లో ఇదే పరిస్థితి దాపురించింది. విజయనగరం జిల్లా గజపతినగరం(Gajapatinagaram)లో యూరియా కోసం గ్రామ సచివాలయం వద్ద బారులు తీరారు. ఎరువుల(Fertilizers) స్టాక్ తక్కువగా ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. సకాలంలో ఎరువులు అందించాలని రైతులు డిమాండ్ చేశారు.

Next Story