రాజానగరంలో పెద్దపులి సంచారం.. ప్రభుత్వం కీలక ప్రకటన

by Vemula.Srinu Prasad |

తూర్పుగోదావరి జిల్లా రాజానగరం సమీపంలో పెద్దపులి సంచరిస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం కీలక ప్రకటన విడుదల చేసింది...

రాజానగరంలో పెద్దపులి సంచారం.. ప్రభుత్వం కీలక ప్రకటన
X

దిశ, వెబ్ డెస్క్: తూర్పుగోదావరి జిల్లా(East Godavari District) రాజానగరం(Rajanagaram) సమీపంలో పెద్దపులి(Tiger) సంచరిస్తోంది. దీంతో స్థానిక ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం కీలక ప్రటకన చేసింది. ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని భరోసా ఇచ్చింది. పెద్దపులిని పట్టుకునేందుకు అటవీ శాఖ అధికారులు క్షేత్రస్థాయిలో ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టినట్లు వెల్లడించింది.

పెద్దపులి ఆనవాళ్లు గుర్తింపు

ఇక తొర్రేడు, సీతానగరం ప్రాంతాల సమీపంలో పెద్దపులి ఆనవాళ్లు గుర్తించామని, త్వరలోనే పులిని పట్టుకుంటామని అటవీ శాఖ అధికారులు చెప్పినట్లు ప్రభుత్వం పేర్కొంది. పులిని బంధించేందుకు ట్రాప్ కెమెరాలు, డ్రోన్లు, బోనులను అటవీ శాఖ ఏర్పాటు చేసిందని స్పష్టం చేసింది. తగిన జాగ్రత్తలు తీసుకొని వేగవంతమైన చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించినట్లు చెప్పింది. ప్రజలను అప్రమత్తం చేసేందుకు వెంటనే హెచ్చరిక బోర్డులు ఏర్పాట్లు జరుగుతున్నట్లు పేర్కొంది. పెద్దపులి పట్టుబడే వరకు అప్రమత్తంగా ఉండాలని ప్రజలు, రైతులకు విజ్ఞప్తు చేస్తున్నట్లు ప్రకటించింది. ఒంటరిగా వ్యవసాయ క్షేత్రాలకు వెళ్లకూడదని, రాత్రి వేళల్లో పశువుల పాకల చుట్టూ అధిక కాంతినిచ్చే దీపాలు ఏర్పాటు చేసుకోవాలని ప్రభుత్వం సూచించింది. ప్రభుత్వ యంత్రాంగం నిరంతరం పరిస్థితిని పర్యవేక్షిస్తుందని, ప్రజల భద్రతే తమ లక్ష్యమని స్పష్టం చేసింది. పెద్దపులిని త్వరితగతిన పట్టుకునేందుకు అన్ని చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం భరోసా ఇచ్చింది.

Next Story