వరద పోటెత్తుతోంది.. తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: మంత్రి అనగాని

by Yella Dhawani Reddy |

కృష్ణా నది పరీవాహక ప్రాంతాల్లో గత కొన్ని రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి.

వరద పోటెత్తుతోంది.. తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: మంత్రి అనగాని
X

దిశ, వెబ్ డెస్క్: కృష్ణా నదీ పరీవాహక ప్రాంతాల్లో గత కొన్ని రోజులుగా భారీ వర్షాలు (Heavy rains) కురుస్తున్నాయి. దీంతో విజయవాడలోని ప్రకాశం బ్యారేజ్‌కు (Prakasham barrage) వరద పోటెత్తటంతో.. అధికారులు 35 గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా మంత్రి అనగాని సత్యప్రసాద్ ప్రజలను అప్రమత్తం ఉండాలని సూచించారు. ప్రకాశం బ్యారేజ్‌కు వరద పోటెత్తుతోందని, కావున తీర ప్రాంత ప్రజలను రెవెన్యూ అధికారులు అప్రమత్తం చేయాలని ఆదేశించారు. గ్రామాల్లోకి నీరు చేరకుండా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రజలకు అధికారులు అందుబాటులో ఉండాలని మంత్రి తెలిపారు. ప్రజల ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా, పటిష్టమైన రక్షణా ఏర్పాట్లు చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

Next Story