- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Sunkesula : సుంకేసులకు జలకళ.. 21 గేట్లు ఎత్తి నీటి విడుదల
కర్నూల్ జిల్లాలోని సుంకేసుల ప్రాజెక్టుకు జలకళ వచ్చింది. ఎగువ ప్రాంతాల్లో కురుస్తోన్న భారీ వర్షాలకు వరద నీరు భారీగా వచ్చి చేరడంతో అధికారులు గేట్లను ఎత్తి నీరు విడుదల చేశారు.

దిశ, వెబ్‌డెస్క్: కర్నూల్ జిల్లాలోని సుంకేసుల ప్రాజెక్టుకు జలకళ వచ్చింది. ఎగువ ప్రాంతాల్లో కురుస్తోన్న భారీ వర్షాలకు వరద నీరు భారీగా వచ్చి చేరడంతో అధికారులు గేట్లను ఎత్తి నీరు విడుదల చేశారు. మొత్తం 30 గేట్లలో ప్రస్తుతం 21 గేట్లను ఎత్తి.. కేసీ కెనాల్ త్రాగునీటి కోసం 1847 క్యూసెక్కుల నీరు విడుదల చేశారు. డ్యామ్ పూర్తి స్థాయి నీటి సామర్థ్యం 1.20 టీఎంసీలు ఉండగా.. ప్రస్తుతం 290.30 టీఎంసీల నీరు నిల్వ ఉంది.
మరోవైపు శ్రీశైలం జలాశయానికి వరద పెరుగుతుండటంతో.. రెండు గేట్ల ద్వారా నీటిని నాగార్జునసాగర్ కు విడుదల చేస్తున్నారు. జూరాల, సుంకేసుల ప్రాజెక్టుల నుంచి శ్రీశైలానికి 1,27,392 క్యూసెక్కుల ఇన్ ఫ్లో వస్తుండగా.. ఔట్ ఫ్లో 1,40,009 క్యూసెక్కులుగా ఉంది. రెండు స్పిల్ వే గేట్ల ద్వారా 53,764 క్యూసెక్కుల నీటిని రిలీజ్ చేస్తున్నారు. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటరీ నుంచి 20 వేల క్యూసెక్కులు, ఎడమగట్టు విద్యుత్ కేంద్రం నుంచి 30,930 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు.






