కృష్ణమ్మ పరుగులు.. రికార్డు స్థాయిలో హంద్రీనీవా నుంచి నీటి విడుదల

by Naga Rani Yarlagadda |

ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాల కారణంగా కృష్ణమ్మ పరుగులు పెడుతోంది.

కృష్ణమ్మ పరుగులు.. రికార్డు స్థాయిలో హంద్రీనీవా నుంచి నీటి విడుదల
X

దిశ, వెబ్‌డెస్క్: ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాల కారణంగా కృష్ణమ్మ పరుగులు పెడుతోంది. హంద్రీ-నీవా ప్రధాన కాలువకు వరదనీరు పోటెత్తడంతో.. అధికారులు రికార్డు స్థాయిలో నీటిని విడుదల చేశారు. పదేళ్లలో ఎన్నడూలేని రీతిలో.. అనంతపురం జిల్లా వజ్రకరూరు మండలం రాగులపాడు వద్దనున్న 8వ పంప్ హౌస్ నుంచి తొలిసారిగా 10 పంపుల ద్వారా 3150 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు. గతంలో 8 గేట్ల నుంచి మాత్రమే నీటిని ఎత్తిపోశారు. కాలువను విస్తరించడంతో తొలిసారిగా 10 పంపుల్ని ఆన్ చేసి నీటిని విడదల చేసినట్లు అధికారులు తెలిపారు. మరోవైపు శ్రీశైలం ప్రాజెక్టు నుంచి, విజయవాడ ప్రకాశం బ్యారేజీ నుంచి కూడా దిగువకు నీటి విడుదల కొనసాగుతోంది.

Next Story