వంశధార, నాగావళి నదులకు వరద ముప్పు.. 11 గ్రామాలకు అలర్ట్

by Vemula.Srinu Prasad |

వంశధార, నాగావళి నదులకు వరద ముప్పు నెలకొంది....

వంశధార, నాగావళి నదులకు వరద ముప్పు.. 11 గ్రామాలకు అలర్ట్
X

దిశ, వెబ్ డెస్క్: విజయనగరం(Vizianagaram), శ్రీకాకుళం(Srikakulam) జిల్లాల్లో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురుస్తోంది. బంగాళాఖాతం(Bay of Bengal)లో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారిన విషయం తెలిసిందే. అయితే ఈ వాయుగుండం ఎఫెక్ట్ విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలపై పడింది. ఈ మేరకు గురువారం ఉదయం నుంచి ఈ రెండు జిల్లాల్లో ఎడతెరిపి లేకుండా వర్షం(Rain) కురుస్తోంది. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. రాజాం పరిసర ప్రాంతాల్లో విద్యుత్ స్తంభాలు కూలిపోయాయి. కొన్ని చోట్ల భారీ వృక్షాలు నేలకొరిగాయి.


మరోవైపు భారీగా కురుస్తున్న వర్షంతో వంశధార, నాగావళికి భారీగా వరద ప్రవాహం పెరిగింది. దీంతో 11 గ్రామాలపై వరద పడే అవకాశం ఉందని అధికారులు అంచనా వేశారు. ఈ మేరకు అలర్ట్ జారీ చేశారు. ఈ నదుల పరివాహక ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రధానంగా ఆముదాలవలస, బూర్జ, ఎచ్చెర్ల మండలాలకు బిగ్ అలర్ట్ జారీ చేశారు. శ్రీకాకుళం జిల్లా కలెక్టరేట్‌లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. ఈ నెంబర్ 08942240557కు కాల్ చేయాలని అధికారులు పేర్కొన్నారు.

Next Story