కృష్ణా బ్యారేజీకి భారీగా వరద.. ప్రమాద హెచ్చరిక జారీ

by Vemula.Srinu Prasad |

కృష్ణా బ్యారేజీకి భారీగా వరద ప్రవాహం పెరిగింది..

కృష్ణా బ్యారేజీకి భారీగా వరద.. ప్రమాద హెచ్చరిక జారీ
X

దిశ, వెబ్ డెస్క్: మొంథా తుపాను(CyClone Montha) ప్రభావం రాష్ట్రంపై భారీగా పడింది. తుపాను తీరం దాటినప్పటికి వర్షం కుండపోతగా కురిసింది. దీంతో రాష్ట్రంలో పలుచోట్ల లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. వాగులు, వంకలు పొంగిపొర్లాయి. నదులు, కాలువులు ఉధృతి ప్రవహించాయి. ప్రభుత్వం అప్రమత్తతో ప్రాణ నష్టం తగ్గినా ఆస్తి, పంట నష్టం జరిగింది.

అయితే ఈ రోజు కృష్ణా బ్యారేజీ(Krishna Barriage)కి భారీగా వరద ప్రవాహం(Flood Floating) పెరిగింది. దీంతో బ్యారేజీకి ఇన్ ఫ్లో 5,38867 క్యూసెక్కులుగా ఉంది. దీంతో నదీ పరివాహక ప్రాంతానికి బిగ్ అలర్ట్ జారీ చేశారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు.ఇప్పటికే మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేసేందుకు పరిస్థితిని పరిశీలిస్తున్నారు.

Next Story