- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
విజయవాడ-కర్నూలు మధ్య విమాన సర్వీసులు : MP Ram Mohan Naidu Kinjarapu
ఏపీ(AP) ప్రజలకు మరో గుడ్ న్యూస్ తెలిపారు కేంద్ర పౌర విమానయానశాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు(MP Rammohan Naidu).

దిశ, వెబ్ డెస్క్ : ఏపీ(AP) ప్రజలకు మరో గుడ్ న్యూస్ తెలిపారు కేంద్ర పౌర విమానయానశాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు(MP Rammohan Naidu). ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడ, కర్నూలు(Vijayawada-Karnul) మధ్య విమాన సర్వీసు(Flight Service) ప్రారంభిస్తున్నట్టు ప్రకటించారు. జూలై 2, 2025 నుంచి ఈ రెండు పట్టణాల మధ్య సర్వీసులు మొదలవుతాయని పేర్కొన్నారు. ఈ సర్వీసు ప్రతి సోమవారం, బుధవారం, శుక్రవారాల్లో ఇండిగో ఎయిర్‌లైన్స్(Indigo Airlines) ద్వారా నడుస్తుందని తెలిపారు. ఏపీ రాజధాని అమరావతిని కర్నూలుతో కలుపుతూ రాష్ట్రంలో అంతర్-కనెక్టివిటీని బలోపేతం చేయడం ఈ సర్వీసు లక్ష్యమని ఎంపీ రామ్మోహన్ నాయుడు వెల్లడించారు.
అయితే గతంలోనే ఏపీ పరిశ్రమలశాఖ మంత్రి టీజీ భరత్ విజయవాడ-కర్నూలు మధ్య విమాన సర్వీసులు నడపాలని రామ్మోహన్ నాయుడుకు విజ్ఞప్తి చేయగా.. దానిపై సానుకూలంగా స్పందించిన ఎంపీ ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ సర్వీసు ద్వారా విజయవాడ నుంచి కర్నూలు, కర్నూలు NTR అమరావతి ఎయిర్‌పోర్ట్‌కు ప్రయాణ సమయాన్ని తగ్గించి, రాయలసీమ ప్రాంతంతో రాజధాని కనెక్టివిటీని మెరుగుపరుస్తుందని అభిప్రాయపడుతున్నారు.






