- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
శ్రీవారి ఆలయంపై నుంచి వెళ్లిన మరో విమానం..ఆందోళనలో భక్తులు
తిరుమల శ్రీవారి ఆలయంపై నుండి మరో విమానం వెళ్లింది. అతితక్కువ ఎత్తులో నుండి ఆలయ గోపురం పైనుండే విమానం వెళ్లింది. నిజానికి ఆలయంపై నుండి ఎలాంటి రాకపోకలు జరగకూడదు అని ఆగమశాస్త్ర నిబంధనలు ఉన్నాయి.

దిశ, వెబ్ డెస్క్: తిరుమల శ్రీవారి ఆలయంపై నుండి మరో విమానం వెళ్లింది. అతితక్కువ ఎత్తులో నుండి ఆలయ గోపురం పైనుండే విమానం వెళ్లింది. నిజానికి ఆలయంపై నుండి ఎలాంటి రాకపోకలు జరగకూడదు అని ఆగమశాస్త్ర నిబంధనలు ఉన్నాయి. దీంతో ఇప్పటికే తిరుమలను నోఫ్లై జోన్‌గా ప్రకటించాలని టీటీడీ కేంద్రానికి విజ్ఞప్తి చేసింది. అయినప్పటికీ పట్టించుకోకుండా ఆలయంపై నుండి విమానాలు వెళుతుండటంతో భక్తుల్లో ఆందోళన నెలకొంది. మరోవైపు మార్చి నెలలో ఒకేరోజు తిరుమల ఆలయం సమీపంలో ఏకంగా ఎనిమిది విమానాలు వెళ్లాయి. మే నెలలో ఆలయంపై నుండి మూడు విమానాలు వెళ్లాయి. అయితే కొన్ని నెలల క్రితమే టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు కేంద్రపౌర విమానయానశాఖ మంత్రి రామ్మోహన్ నాయుడుకు లేఖ రాశారు. తిరుమలకు విమానాలు రాకుండా నోఫ్లై జోన్‌గా ప్రకటించాలని కోరారు. అయినప్పటికీ విమానాల రాకపోకలు జరుగుతూనే ఉన్నాయి. మరోవైపు అప్పుడప్పుడూ డ్రోన్లు కూడా ఎగరడం భక్తులను ఆందోళను గురి చేస్తోంది.






