Flash.. Flash..: ఏపీ సచివాలయంలో భారీ అగ్ని ప్రమాదం.. ఎగసిపడుతోన్న మంటలు

by Kema Shiva Kumar |   (  Updated:2025-04-04 07:20:58  IST  )

ఏపీ సచివాయలం (AP Secretariat)లో భారీ అగ్ని ప్రమాదం శుక్రవారం తెల్లవారుజామున సంభవించింది.

Flash.. Flash..: ఏపీ సచివాలయంలో భారీ అగ్ని ప్రమాదం.. ఎగసిపడుతోన్న మంటలు
X

దిశ, వెబ్‌డెస్క్: ఏపీ సచివాలయం (AP Secretariat)లో భారీ అగ్ని ప్రమాదం శుక్రవారం తెల్లవారుజామున సంభవించింది. భవనంలోని 2వ బ్లాక్‌లో ఉన్నట్టుండి మంటలు ఒక్కసారిగా చేలరేగాయి. దీంతో నైట్ డ్యూటీలో ఉన్న పోలీసులు గమనించి ఫైర్ సిబ్బందికి సమాచారం అందజేశారు. ఈ మేరకు వారు ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. అయితే, బిల్డింగ్‌లోని 2వ బ్లాక్‌లో పవర్ బ్యాక్‌ అప్ కోసం బ్యాటరీలు స్టోర్ చేసే ప్రాంతంలో ప్రమాదం జరిగినట్లుగా సిబ్బంది గుర్తించారు. సచివాలయంలో అగ్ని ప్రమాదం హోంమంత్రి వంగలపూడి (Home Minister Anitha) అనిత ఆరా తీశారు.. అనంతరం జరిగన ఘటనపై విచారణకు ఆదేశించారు. ఈ మేరకు ప్రమాదానికి గల కారణాలపై భద్రతా సిబ్బంది దర్యాప్తు చేపట్టారు. అదేవిధంగా ప్రమాద స్థలాన్ని GAD పొలిటికల్ సెక్రటరీ మీనా (GAD Political Secretary Meena) పరిశీలించారు. బ్యాటరీల మెయింటేనెన్స్‌ (Battery Maintenance)లో లోపాలే ప్రమాదానికి కారణమని పోలీసులు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు.

Next Story