- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Flash.. Flash: ఏపీ మంత్రివర్గ సమావేశం వాయిదా..
అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు ప్రారంభమైన వేళ మధ్యాహ్నం అసెంబ్లీ సమావేశ మందిరంలో మధ్యహ్నం 3 గంటలకు కేబినెట్ భేటీ జరగాల్సి ఉంది.

దిశ, వెబ్‌డెస్క్: అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు ప్రారంభమైన వేళ మధ్యాహ్నం అసెంబ్లీ సమావేశ మందిరంలో మధ్యహ్నం 3 గంటలకు కేబినెట్ భేటీ జరగాల్సి ఉంది. అయితే, అనూహ్యంగా సమావేశం వాయిదా పడింది. రేపు మధ్యాహ్నం వెలగపూడిలోని సచివాలయంలో మధ్యాహ్నం 2 గంటలకు సీఎం చంద్రబాబు ఛాంబర్‌లో మంత్రివర్గ సమావేశం నిర్వహించనున్నట్లుగా అధికారులు వెల్లడించారు. కాగా, ఈ అసెంబ్లీ సమావేశాల్లోనే ప్రభుత్వం పలు బిల్లులను ఆర్డినెన్స్‌ల రూపంలో ప్రవేశపెట్టి ఆమోదింపజేయాలని యోచిస్తోంది. తొలుత కేబినెట్ భేటీ నిర్వహించి అమరావతి ప్రత్యేక ప్రయోజన వాహకం (SPV)కి ఆమోదముద్ర వేయనున్నారు. అదేవిధంగా వైఎస్ఆర్ తాడిగడప మున్సిపాలిటీని ‘తాడిగడప పురపాలక సంఘం’గా పేరు మార్చే ప్రతిపాదనకు ఓకే చెప్పనున్నారు. ఇక పంచాయితీ రాజ్, మున్సిపల్ చట్ట సవరణలకు సంబంధించిన ఆర్డినెన్స్, నాలా చట్ట సవరణ, షెడ్యూల్ సబ్ కాస్ట్, ఇండియా ఇంటర్నేషనల్ యూనివర్సిటీ ఆర్డినెన్స్‌లకు కేబినెట్ ఆమోదం తెలిపి చట్ట సభల్లో ప్రవేశపెట్టనున్నారు.






