సైకో పాలనలో ఐదేళ్లు అమరావతి హాహాకారాలు.. వైసీపీ‌పై మంత్రి అనగాని ఫైర్

by Kema Shiva Kumar |   (  Updated:2025-05-02 05:11:39  IST  )

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాజధాని అమరావతి (Amaravati) నిర్మాణ పనుల పున:ప్రారంభానికి సమయం ఆసన్నమైంది.

సైకో పాలనలో ఐదేళ్లు అమరావతి హాహాకారాలు.. వైసీపీ‌పై మంత్రి అనగాని ఫైర్
X

దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాజధాని అమరావతి (Amaravati) నిర్మాణ పనుల పున:ప్రారంభానికి సమయం ఆసన్నమైంది. ప్రధాని నరేంద్ర మోదీ (PM Narendra Modi) పర్యటన సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసింది. శుక్రవారం అమరావతి నిర్మాణ పనులకు ప్రధాని శ్రీకారం చుట్టనున్నారు. రూ.49,040 కోట్ల విలువైన ప్రాజెక్టు పనులకు ఆయన శంకుస్థాపనలు చేయనున్నారు. అదేవిధంగా మరో రూ.8 వేల కోట్ల విలువైన పనులకు ప్రారంభోత్సవాలు చేస్తారు. ఈ మేరకు శుక్రవారం మధ్యాహ్నం కేరళ (Kerala)లోని తిరువనంతపురం (Thiruvananthapuram) నుంచి స్పెషల్ ఫ్లైట్‌లో ప్రధాని మోదీ గన్నవరం ఎయిర్‌పోర్టుకు చేరుకోనున్నారు.

ఈ క్రమంలోనే రాష్ట్రంలో గత వైసీపీ (YCP) పాలనపై రెవెన్యూ, స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ (Anagani Satya Prasad) సంచలన వ్యాఖ్యలు చేశారు. సైకో పాలనలో ఐదేళ్ల పాటు అమరావతి దిక్కుమొక్కు లేకుండా హాహాకారాలు చేసిందని అన్నారు. నేడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో పునరుజ్జీవం పొందుతుందిని కామెంట్ చేశారు. వైసీపీ చేసిన కుట్రలు, విష ప్రచారాలకు చెక్ పెడుతూ.. విజనరీ లీడర్ సీఎం చంద్రబాబు (CM Chandrababu) మళ్లీ అమరావతిని సగర్వంగా తలెత్తుకునేలా మళ్లీ నిలబెడుతున్నారని పేర్కొన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ ఆశీస్సులతో అమరావతి ఇక అజరామరంగా వెలగనుందని.. భవిష్యత్తు తరాలకు తలమానికంగా నిలుస్తుందని మంత్రి అనగాని సత్యప్రసాద్ అన్నారు.

Next Story