Breaking: అమ్మోనియం గ్యాస్ లీక్.. ఐదుగురికి తీవ్ర గాయాలు

by Vemula.Srinu Prasad |   (  Updated:2025-04-23 11:54:19  IST  )

రొయ్యల పరిశ్రమలో గ్యాస్ లీక్ అయి ఐదుగురు కార్మికులకు గాయాలయ్యాయి..

Breaking: అమ్మోనియం గ్యాస్ లీక్.. ఐదుగురికి తీవ్ర గాయాలు
X

దిశ, వెబ్ డెస్క్: రొయ్యల పరిశ్రమ(Shrimp industry)లో గ్యాస్ లీక్ అయింది. రోజు మాదిరిగా కార్మికులు పని చేస్తున్నారు. అయితే ఒక్కసారిగా గ్యాస్ పైప్ పగిలింది. దీంతో ముగ్గురు కార్మికులు గాయపడ్డారు. ఈ దాటికి భవనం స్లాబ్ పెచ్చులూడిపోయాయి. ఈ ఘటనలో మరో ఇద్దరు కార్మికులకు గాయాలు కావడంతో మొత్తం ఐదుగురిని ఆస్పత్రికి తరలించారు. పశ్చిమ గోదావరి జిల్లా(West Godavari District) మోగల్లులో వశిష్ట మెరైన్ రొయ్యల పరిశ్రమ ఉంది. రోజూ మాదిరిగానే ఫ్రిడ్జ్‌ను కూలింగ్ చేసేందుకు అమ్మోనియం గ్యాస్‌(Ammonium gas)ను పంపుతున్నారు. అయితే ఒక్కసారిగా పైప్ పగిలిపోయింది. ఈ ఘటనలో పశ్చిమబెంగాల్, అస్సాం, ఒడిసాకు చెందిన కార్మికులు గాయపడ్డారు. వీరిని ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Next Story