తిరుపతి జిల్లాలో దారుణం: తల్లి, భార్యను చంపి.. ఇద్దరు బిడ్డలతో కలిసి వ్యక్తి ఆత్మహత్య

by Gantepaka Srikanth |   (  Updated:2026-04-22 17:17:20  IST  )

తిరుపతి జిల్లా పరిధిలోని వెంకటకృష్ణపాలెంలో బుధవారం ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు వ్యక్తులు మృతి చెందడం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.

తిరుపతి జిల్లాలో దారుణం: తల్లి, భార్యను చంపి.. ఇద్దరు బిడ్డలతో కలిసి వ్యక్తి ఆత్మహత్య
X

దిశ, వెబ్‌డెస్క్: తిరుపతి జిల్లా పరిధిలోని వెంకటకృష్ణపాలెంలో బుధవారం ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు వ్యక్తులు మృతి చెందడం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. కుటుంబ కలహాలు లేదా ఇతర కారణాలతో మోహన్ అనే వ్యక్తి తన తల్లిని, భార్యను హత్య చేసి, ఆపై ఇద్దరు చిన్న పిల్లలతో కలిసి తానూ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసుల ప్రాథమిక సమాచారం మేరకు.. వెంకటకృష్ణపాలెంకు చెందిన మోహన్ అనే వ్యక్తి బుధవారం తెల్లవారుజామున తన తల్లిని, భార్యను గొంతు నులిమి అత్యంత కిరాతకంగా చంపేశాడు. ఆపై తన ఇద్దరు పిల్లలను తీసుకుని ఇంటి నుంచి బయటకు వచ్చాడు. సమీపంలోని వేపకుంట రైల్వే ట్రాక్ వద్దకు చేరుకున్న మోహన్, అటుగా వస్తున్న రైలు కింద తన ఇద్దరు బిడ్డలతో కలిసి దూకి బలవన్మరణానికి పాల్పడ్డాడు. రైల్వే ట్రాక్‌పై ముక్కలైన మృతదేహాలను గమనించిన స్థానికులు వెంటనే రైల్వే పోలీసులకు సమాచారం అందించారు. మృతులను మోహన్, అతని పిల్లలుగా గుర్తించారు. అటు ఇంటి వద్ద తల్లి, భార్య మృతదేహాలు కనిపించడంతో ఆ ప్రాంతమంతా విషాదంలో మునిగిపోయింది. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ దారుణానికి ఒడిగట్టడానికి గల కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. కేసు నమోదు చేసుకుని లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.

Read More..

మట్కా స్థావరాలపై పోలీసుల దాడి.. ముగ్గురు అరెస్ట్

Next Story