- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బ్రహ్మంగారిమఠంలో తీవ్ర విషాదం.. ఐదుగురు చిన్నారులు మృతి
కడప(Kadapa) జిల్లా బ్రహ్మంగారిమఠం(Brahmamgari Matam) మండలం మల్లెపల్లెలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది.

దిశ, వెబ్‌డెస్క్: కడప(Kadapa) జిల్లా బ్రహ్మంగారిమఠం(Brahmamgari Matam) మండలం మల్లెపల్లెలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. చెరువులో ఈతకు దిగి ఐదుగురు చిన్నారులు మృతిచెందారు. విషయం తెలిసిన వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు గజ ఈతగాళ్ల సాయంతో నలుగురి మృతదేహాలు వెలికి తీశారు. ఒక చిన్నారి మృతదేహం కోసం గాలిస్తున్నారు. మృతులు దీక్షిత్, తరుణ్, పార్థు, చరణ్, హర్షగా గుర్తించారు. ప్రస్తుతం హర్ష మృతదేహం కోసం గాలిస్తున్నారు. మృతులంతా 12 ఏళ్లలోపు పిల్లలే కావడం గమనార్హం. చెరువులో ఈతకు వెళ్లిన తమ పిల్లలు తిరిగిరాని లోకాలకు వెళ్లడటంతో బాధిత తల్లిదండ్రులు అంతా కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. వేసవి సెలవుల వేళ పిల్లల పట్ల అప్రమత్తంగా ఉండాలని తల్లిదండ్రులకు పోలీసులు సూచనలు చేశారు. ఎక్కడికి వెళ్తున్నారు.. ఏం చేస్తున్నారని ఆరా తీయాలని చెప్పారు.






