- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తెప్ప బోటులో చేపల వేట.. తీవ్ర విషాదం
by Vemula.Srinu Prasad |
నెల్లూరు జిల్లా బోగోలు సముద్ర తీరంలో ఘోర ప్రమాదం జరిగింది. చేపల వేట కోసం ఓ తెప్ప బోటుపై నలుగురు మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లారు. ..

X
దిశ, వెబ్ డెస్క్: నెల్లూరు జిల్లా బోగోలు సముద్ర తీరంలో ఘోర ప్రమాదం జరిగింది. చేపల వేట కోసం ఓ తెప్ప బోటుపై నలుగురు మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లారు. అయితే ఊహించని విధంగా సముద్రంలో అలల తాకిడికి బోటు అదుపుతప్పి తిరగబడటంతో ఇద్దరు మత్స్యకారులు నీట మునిగి ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రమాదంలో మరణించిన వారిని అలిచర్ల బంగారుపాలెం గ్రామానికి చెందిన తూపిలి బాల మురళి (51), కుమారి గోవిందు (42)గా గుర్తించారు. ప్రమాద సమయంలో బోటులో ఉన్న మిగిలిన ఇద్దరు మత్స్యకారులు సురక్షితంగా బయటపడినట్లు సమాచారం. ఈ ఘటనతో అలిచర్ల బంగారుపాలెం గ్రామంలో తీవ్ర విషాదఛాయలు అలుముకున్నాయి.
Next Story






