విశాఖ తీరంలో చేపల వేట నిషేధం.. కారణం ఏంటంటే?

by Jakkula.Mamatha |   (  Updated:2025-06-20 03:25:34  IST  )

ఏపీ(Andhra Pradesh)లోని విశాఖ సముద్ర తీరంలో చేపల వేటపై ప్రభుత్వం ఆంక్షలు విధించింది.

విశాఖ తీరంలో చేపల వేట నిషేధం.. కారణం ఏంటంటే?
X

దిశ,వెబ్‌డెస్క్: ఏపీ(Andhra Pradesh)లోని విశాఖ సముద్ర తీరంలో చేపల వేటపై ప్రభుత్వం ఆంక్షలు విధించింది. విశాఖపట్నం లోని బీచ్ రోడ్డులో రేపు(జూన్ 21) నిర్వహించనున్న అంతర్జాతీయ యోగా దినోత్సవం(International Yoga Day)లో పాల్గొనేందుకు ప్రధాని నరేంద్ర మోడీ(PM Narendra Modi) రానున్నారు. ఈ నేపథ్యంలో భద్రతా కారణాల దృష్ట్యా విశాఖ(Visakhapatnam) సముద్ర తీరంలో చేపల వేటను ఈ రోజు(శుక్రవారం), రేపు(శనివారం) నిషేధించారు. ఈ మేరకు సంబంధిత వివరాలను విశాఖ రేంజ్ డీఐజీ గోపినాథ్‌జట్టి తెలిపారు. ఈ క్రమంలో రెండు రోజులు మత్స్యకారులు చేపల వేటకు వెళ్లరాదని స్పష్టం చేశారు. ఈ తరుణంలో మత్స్యకారులు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ప్రధాని నరేంద్ర మోడీ పర్యటన సందర్భంగా భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు.

Next Story