ముళ్లపొదల్లోకి దూసుకెళ్లిన స్కూలు బస్సు.. 40 మంది విద్యార్థులకు తప్పిన ప్రమాదం

by Vemula.Srinu Prasad |

40 మంది విద్యార్థులకు తృటిలో ప్రమాదం తప్పింది...

ముళ్లపొదల్లోకి దూసుకెళ్లిన స్కూలు బస్సు.. 40 మంది విద్యార్థులకు తప్పిన ప్రమాదం
X

దిశ, వెబ్ డెస్క్: 40 మంది విద్యార్థులకు తృటిలో ప్రమాదం తప్పింది. ఈ ఘటన చిత్తూరు జిల్లా(Chittoor District) చెన్నేకొత్తపల్లి(Chennekothapalli) మండలంలో జరిగింది. స్థానిక ప్రైవేటు స్కూలు(School) నుంచి రోజు మాదిరిగానే విద్యార్థులు బస్సు(Bus)లో బయల్దేరారు. కొంతదూరం వెళ్లిన తర్వాత బస్సు టైర్ పంక్చర్ అయింది. దీంతో బస్సు ఒక్కసారిగా అదుపుతప్పింది. పక్కనే ఉన్న ముళ్లపొదల్లోకి దూసుకెళ్లింది. ఈ సమయంలో బస్సులో 40 మంది విద్యార్థులు ఉన్నారు. ఎవరికీ ఎలాంటి గాయాలు కాకపోవడంతో ఊపిరిపీల్చుకున్నారు.

Next Story