- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Covid 19 : బ్రేకింగ్ న్యూస్.. రాష్ట్రంలో తొలి కరోనా కేసు
దేశంలో కరోనా కేసులు(Carona Cases) రోజురోజుకూ వేగంగా పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అలర్ట్ అయిన విషయం తెలిసిందే.

దిశ, వెబ్ డెస్క్ : దేశంలో కరోనా కేసులు(Carona Cases) రోజురోజుకూ వేగంగా పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అలర్ట్ అయిన విషయం తెలిసిందే. తాజాగా ఏపీ(AP)లో కోవిద్ 19 తొలి కేసు(Covid 19 Positive Case) నమోదు కావడం కలకలం రేపింది. విశాఖపట్నానికి(Vishakhapatnam) చెందిన ఓ మహిళకు కరోనా నిర్ధారణ అయింది. విశాఖలోని మద్దెలపాలెంకు చెందిన ఓ మహిళకు గత రెండు రోజులుగా తీవ్ర జ్వరం, దగ్గు, జలుబు లక్షణాలతో బాధపడుతూ ఆసుపత్రికి వెళ్ళింది. అనుమానం వచ్చిన వైద్యులు ఆమెకు ఆర్టీపీసీఆర్ టెస్ట్ చేయగా పాజిటివ్ వచ్చింది.
సదరు మహిళను వారం రోజుల పాటు హోం క్వారంటైన్ లో ఉంచారు వైద్యాధికారులు. కాగా ఆమె భర్తకు, పిల్లలకు కూడా పరీక్షలు నిర్వహించగా వారికి నెగెటివ్ వచ్చినట్టు వైద్యులు తెలిపారు. ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, కాస్త అప్రమత్తంగా ఉంటే సరిపోతుందని, బహిరంగ ప్రదేశాల్లో మాస్కులు ధరించాలని సూచించారు.






