అలిపిరి మెట్ల మార్గంలో ఫస్ట్‌ ఎయిడ్‌ సెంటర్‌

by Muthe.Rajitha |

భక్తుల సౌకర్యార్థం టీటీడీ మరో నిర్ణయం తీసుకుంది.

అలిపిరి మెట్ల మార్గంలో ఫస్ట్‌ ఎయిడ్‌ సెంటర్‌
X

దిశ, వెబ్ డెస్క్ : భక్తుల సౌకర్యార్థం టీటీడీ మరో నిర్ణయం తీసుకుంది. అలిపిరి మెట్ల మార్గంలో ఫస్ట్ ఎయిడ్ సెంటర్ ను నేడు ప్రారంభించింది. తిరుమల అలిపిరి మెట్లమార్గంలో 7వ మైలు వద్ద ఏర్పాటు చేసిన ఈ ఫస్ట్ ఎయిడ్ కేంద్రాన్ని టీటీడీ ఛైర్మన్‌ బీఆర్‌ నాయుడు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. శ్రీవారి దర్శనానికి మెట్ల మార్గంలో వచ్చే భక్తుల ఆరోగ్య భద్రతను దృష్టిలో ఉంచుకుని ఈ ఫస్ట్‌ ఎయిడ్‌ సెంటర్‌ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. దీని ద్వారా భక్తులకు త్వరితగతిన వైద్య సేవలు అందుతాయని, అనారోగ్యానికి గురై అత్యవసర పరిస్థితులు ఎదురైతే ఈ కేంద్రం సేవలను వినియోగించుకోవాలని సూచించారు. ఇక్కడ టీటీడీ, అపోలో వైద్యులతో పాటు శిక్షణ పొందిన పారామెడికల్ బృందం సేవలందిస్తుంది. ఈసీజీ యంత్రం, ఆక్సిజన్‌ కాన్సన్‌ట్రేటర్‌, నెబ్యులైజర్‌తో పాటు అవసరమైన మందులు కూడా అందుబాటులో ఉంటాయి.

Next Story