- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పంట పొలాల్లో అగ్నిప్రమాదం: ఫైర్ సిబ్బందిని అలర్ట్ చేసిన ఎమ్మెల్యే
బాపట్ల జిల్లా పర్చూరు మండలం ఇనక్కలపాలెం–పావులూరు గ్రామాల మధ్య ఉన్న పంట పొలాల్లో ఆదివారం ఒక్కసారిగా భారీగా మంటలు చెలరేగాయి. ....

దిశ, వెబ్ డెస్క్: బాపట్ల జిల్లా(Bapatla District) పర్చూరు మండలం(Parchur Mandal) ఇనక్కలపాలెం–పావులూరు గ్రామాల మధ్య ఉన్న పంట పొలాల్లో(Crop Fields) ఆదివారం ఒక్కసారిగా భారీగా మంటలు చెలరేగాయి. వేసవి వేడికి తోడు గాలి తీవ్రత తోడవడంతో అగ్నికీలలు వేగంగా వ్యాపించాయి. కళ్లముందే పంట చేతికి అందకుండా పోతుందేమోనన్న ఆందోళనలో రైతులు ఉన్న సమయంలో స్థానిక ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు వెంటనే స్పందించారు. ప్రమాద తీవ్రతను గమనించిన ఆయన స్వయంగా అగ్నిమాపక శాఖ అధికారులకు ఫోన్ చేసి, ఫైర్ ఇంజన్లను ఘటనాస్థలికి పంపాలని ఆదేశించారు.
రంగంలోకి దిగి మంటలను..
ఎమ్మెల్యే ఆదేశాలతో అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన రంగంలోకి దిగి మంటలను అదుపు చేసే ప్రక్రియను ప్రారంభించారు. కేవలం ఫైర్ సిబ్బందినే కాకుండా తహసిల్దార్, పోలీసు అధికారులను (సీఐ) ఏలూరి సాంబశివరావు అప్రమత్తం చేశారు. ఉన్నతాధికారులందరూ క్షేత్రస్థాయిలో సమన్వయంతో పని చేసి, మంటలు పక్కనున్న పొలాలకు వ్యాపించకుండా కట్టడి చేయాలని స్పష్టమైన దిశానిర్దేశం చేశారు. మంటలు పూర్తిగా అదుపులోకి వచ్చే వరకు యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు.
పంట నష్టం తగ్గించేలా చర్యలు
రైతులకు నష్టం కలగకుండా ఉండేందుకు మార్కెట్ కమిటీ చైర్మన్‌ను స్వయంగా ఘటనాస్థలికి వెళ్లి పరిస్థితిని సమీక్షించాలని ఎమ్మెల్యే కోరారు. పంట నష్టాన్ని వీలైనంత తగ్గించేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు విజ్ఞప్తి చేశారు. ఎమ్మెల్యే తక్షణ స్పందనతో సకాలంలో సహాయక చర్యలు అందడంతో రైతులు ఊపిరి పీల్చుకున్నారు.






