- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
తిరుపతి - సికింద్రాబాద్ సెవెన్ హిల్స్ ఎక్స్‌ప్రెస్‌లో మంటలు
by Naga Rani Yarlagadda |
తిరుపతి నుంచి సికింద్రాబాద్ వెళ్తున్న సెవెన్ హిల్స్ ఎక్స్ ప్రెస్ లో మంటలు చెలరేగడంతో ప్రయాణికులు ఆందోళన చెందారు.

X
దిశ, వెబ్‌డెస్క్: తిరుపతి నుంచి సికింద్రాబాద్ వెళ్తున్న సెవెన్ హిల్స్ ఎక్స్ ప్రెస్ లో మంటలు చెలరేగడంతో ప్రయాణికులు ఆందోళన చెందారు. శ్రీసత్యసాయి జిల్లా ధర్మవరం మండలం చిగిచెర్ల రైల్వే స్టేషన్ వద్ద రైలులో మంటలు చెలరేగడాన్ని గుర్తించి ప్రయాణికులు కేకలు పెట్టారు. దాంతో లోకో పైలట్ వెంటనే రైలుని నిలిపివేశాడు. దిగి చూసేసరికి బోగీ చక్రం బ్రేక్ వద్ద రాపిడికి గురికావడంతో మంటలు వ్యాపించినట్లు గుర్తించి వెంటనే రైల్వే సిబ్బందికి సమాచారం అందించాడు. వెంటనే అప్రమత్తమైన సిబ్బంది, రైల్వే గార్డు మంటల్ని అదుపు చేయడంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు.
Next Story






