- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
చేపల వేట బోటులో అగ్నిప్రమాదం
by Naga Rani Yarlagadda |
బాపట్ల జిల్లా నిజాంపట్నం హార్బర్ వద్ద చేపలవేట బోటులో భారీ అగ్నిప్రమాదం జరిగింది.

X
దిశ, వెబ్‌డెస్క్: బాపట్ల జిల్లా నిజాంపట్నం హార్బర్ వద్ద చేపలవేట బోటులో భారీ అగ్నిప్రమాదం జరిగింది. జెట్టీ వద్ద ఆపి ఉంచిన చేపలవేట బోటులో ప్రమాదవశాత్తు మంటలు చెలరేగడంతో.. బోటులో ఉన్న మత్స్యకారులు కిందికి దూకేశారు. ఈ ప్రమాదంలో బోటు దగ్ధమవ్వగా.. అందులో ఉన్న వలలు పూర్తిగా మంటల్లో కాలిపోయాయి. అగ్నిప్రమాదం కారణంలో సుమారు రూ.20 లక్షల ఆస్తినష్టం సంభవించినట్లు తెలుస్తోంది. మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లేందుకు సిద్ధమవుతున్న క్రమంలో ప్రమాదం జరిగినట్లు మత్స్యకారులు తెలిపారు. వలలు, బోటు దగ్ధమై తీవ్రంగా నష్టపోయామని, తమను ప్రభుత్వం ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు.
Next Story






