తహశీల్దార్ కార్యాలయంలో అగ్నిప్రమాదం.. కీలక ఫైళ్లు దగ్ధం

by Thanuru Gopichand |

లోతైన దర్యాప్తు చేపడతామన్న ఆర్డీఓ.

తహశీల్దార్ కార్యాలయంలో అగ్నిప్రమాదం.. కీలక ఫైళ్లు దగ్ధం
X

దిశ, వెబ్ డెస్క్ : తహశీల్దార్ కార్యాలయంలో అగ్నిప్రమాదం (Fire Accident) చోటు చేసుకున్న సంఘటన ఎన్టీఆర్ జిల్లా నందిగామ-కంచికచర్ల మండల తహశీల్దార్ కార్యాలయంలో (Nandigama Tahsildhar Office) చోటు చేసుకుంది. ఈ అగ్నిప్రమాదంలో కీలక ఫైళ్లు దగ్ధమైనట్లు తెలుస్తోంది. అధికారుల వివరాల ప్రకారం శుక్రవారం ఉదయం అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. పాత పట్టాదారుల పాసు పుస్తకాలు, దస్త్రాలు ఉన్న గదిలో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. దీంతో కీలకమైన ఫైళ్లు దగ్ధమైనట్లు అధికారులు పేర్కొన్నారు. ఘటన విషయం తెలుసుకున్న వెంటనే అధికారులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందజేశారు. వారు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. అనంతరం కార్యాలయ సిబ్బంది మిగిలిన రికార్డుల ఫైళ్లను బయటకు తీసుకొచ్చారు. వాటిలో మిగిలిన వాటిని ప్రత్యేకంగా సేకరించారు. విషయం తెలుసుకున్న ఆర్టీఓ దీనిపై విచారణ జరిపిస్తామన్నారు. అగ్నిప్రమాదంపై అనుమానాలను వ్యక్తం చేశారు. షార్ట్ సర్క్యూట్ కారణంగా జరిగిందా? ఉద్దేశపూర్వకంగానే ఎవరైనా చేశారా అనే కోణంలో దర్యాప్తు చేస్తామన్నారు. కీలకమైన పలు ఫైళ్లు మంటలకు కాలిపోయాయని పేర్కొన్నారు. ప్రమాద సమయంలో ఎవరూ కూడా లేకపోవడంతో ప్రాణ నష్టం తప్పింది. అయితే కొంత మేర ఆస్తి నష్టం జరిగినట్లు అధికారులు తెలిపారు.

Next Story