- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పరవాడ జవహర్‌లాల్ ఫార్మాసిటీలో అగ్నిప్రమాదం
పరవాడ జవహర్ లాల్ ఫార్మాసిటీలో మూడురోజులుగో ఏదొక ప్రమాదం జరుగుతూనే ఉంది.

X
దిశ, వెబ్‌డెస్క్: పరవాడ జవహర్ లాల్ ఫార్మాసిటీలో మూడురోజులుగో ఏదొక ప్రమాదం జరుగుతూనే ఉంది. మొన్న ఒక్క కంపెనీలో, నిన్న మరో కంపెనీలో జరిగిన ప్రమాదాల్లో కార్మికులు తీవ్రంగా గాయపడిన విషయం తెలిసిందే. తాజాగా మరో ఫార్మా కంపెనీలో అగ్ని్ప్రమాదం జరిగింది. శ్రీ సాయిచందన ప్రైవేట్ లిమిటెడ్ ప్రొడక్షన్ బ్లాక్ -2లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. రియాక్టర్ వద్ద కెమికల్ లీకవ్వడంతో మంటలు వ్యాప్తి చెందినట్లుగా తెలుస్తోంది. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది మంటల్ని అదుపుచేశారు. ప్రమాదసమయంలో అక్కడ కార్మికులు లేకపోవడంతో పెనుప్రమాదం తప్పినట్లయింది. ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం లేదని అధికారులు స్పష్టం చేశారు. ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటల్ని అదుపుచేశారు. ఈ ప్రమాద ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Next Story






