విజయవాడ బస్టాండ్లో అగ్నిప్రమాదం.. ఫర్నీచర్, కంప్యూటర్లు దగ్ధం

by Naga Rani Yarlagadda |

విజయవాడ బస్టాండ్లో అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఫైళ్లు, కంప్యూటర్లు, ఫర్నీచర్ దగ్ధమయింది.

విజయవాడ బస్టాండ్లో అగ్నిప్రమాదం.. ఫర్నీచర్, కంప్యూటర్లు దగ్ధం
X

దిశ, వెబ్‌డెస్క్: విజయవాడలోని పండిట్ నెహ్రూ బస్టాండ్ (PNBS)లో ఆదివారం అగ్నిప్రమాదం సంభవించింది. బస్టాండ్ ప్రాంగణంలోని మొదటి అంతస్తులో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో ప్రయాణికులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. బస్టాండ్ కాంప్లెక్స్ మొదటి అంతస్తులోని ఎగ్జాస్ట్ ఫ్యాన్ల వద్ద విద్యుత్ షార్ట్ సర్క్యూట్ సంభవించడమే ఈ ప్రమాదానికి ప్రధాన కారణంగా అధికారులు ప్రాథమికంగా నిర్ధారించారు. మంటలు వేగంగా వ్యాపించడంతో దట్టమైన పొగ అలుముకుంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. ఈ అగ్నిప్రమాదంలో కార్యాలయానికి సంబంధించిన పాత ఫర్నీచర్, వినియోగంలో లేని కంప్యూటర్లు, కొన్ని కీలక ఫైళ్లు పూర్తిగా కాలిపోయాయి. అయితే.. అదృష్టవశాత్తూ ఈ ఘటనలో ప్రయాణికులకు గానీ, ఆర్టీసీ సిబ్బందికి గానీ ఎలాంటి గాయాలు కాలేదని అధికారులు స్పష్టం చేశారు. మంటలు ఆరిపోవడంతో పెను ప్రమాదం తప్పినట్లయింది.

Next Story