- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మూవీ థియేటర్‌లో అగ్నిప్రమాదం.. పరుగులు తీసిన ప్రేక్షకులు
by Naga Rani Yarlagadda |
థియేటర్లో సినిమా ప్రదర్శన జరుగుతున్న సమయంలో మంటలు చెలరేగడంతో ప్రేక్షకులు పరుగులు తీశారు.

X
దిశ, వెబ్‌డెస్క్: థియేటర్లో సినిమా ప్రదర్శన జరుగుతున్న సమయంలో మంటలు చెలరేగడంతో ప్రేక్షకులు పరుగులు తీశారు. శ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా కావలి టౌన్ లో ఉన్న స్రవంతి థియేటర్లో ఈ ఘటన జరిగింది. ప్రొజెక్టర్ రూమ్ లో మంటలు ఎగసి పడటంతో ఆడియన్స్ భయభ్రాంతులకు గురయ్యారు. భారీగా అగ్నికీలలు ఎగసి పడగా.. ఫైర్ సిబ్బంది మంటల్ని అదుపులోకి తీసుకొచ్చారు. కాగా.. అగ్నిప్రమాదంలో రూమ్ లో ఉన్న సామాగ్రి పూర్తిగా ధ్వంసమైందని పోలీసులు తెలిపారు. విద్యుదాఘాతం కారణంగా మంటలు చెలరేగినట్లు తెలుస్తోంది. కాగా.. ఈ ఘటనతో సమయంలో థియేటర్లో ఆడియన్స్ తక్కువగా ఉండటం వల్ల భారీ ప్రమాదం తప్పినట్లయింది. ప్రమాదంలో ఆస్తినష్టం ఎంతమేర వాటిల్లిందన్న వివరాలు తెలియాల్సి ఉంది.
Next Story






