- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
BREAKING: తాడిపత్రిలో భారీ అగ్నిప్రమాదం
by Naga Rani Yarlagadda |
అనంతపురం జిల్లాలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. తాడిపత్రిలోని లక్కీ ప్లైవుడ్ ఫ్యాక్టరీలో..

X
దిశ, వెబ్‌డెస్క్: అనంతపురం జిల్లాలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. తాడిపత్రిలోని లక్కీ ప్లైవుడ్ ఫ్యాక్టరీలో సోమవారం రాత్రి అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. ఫ్యాక్టరీలో ప్లైవుడ్స్ ఉండటంతో మంటలు ఎగసిపడుతున్నాయి. ఘటనా ప్రాంతానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది.. ఫైరింజన్ల సహాయంతో మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. కాగా.. ప్రమాద సమయంలో ఫ్యాక్టరీలో వర్కర్స్ ఉన్నారా ? అగ్నిప్రమాదంలో ఎవరైనా మరణించారా? అన్న విషయాలు తెలియాల్సి ఉంది. సమాచారం అందుకున్న పోలీసులు స్పాట్ కు చేరుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
Next Story






