మేదరమెట్లలో అగ్నిప్రమాదం.. భారీగా ఆస్తినష్టం

by Naga Rani Yarlagadda |

మంగళవారం (జూన్ 2) అర్ధరాత్రి అద్దంకిలోని మేదరమెట్ల సెంటర్‌లో షార్ట్‌సర్క్యూట్ (short Circuit) కారణంగా ఒక దుకాణంలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. పుస్తకాలు, బ్యాగులు, ఫ్యాన్సీ వస్తువులు అమ్మే ఈ దుకాణంలో నిల్వ చేసిన సరుకు మొత్తం కాలిపోయింది.

మేదరమెట్లలో అగ్నిప్రమాదం.. భారీగా ఆస్తినష్టం
X

దిశ, వెబ్‌డెస్క్: మంగళవారం (జూన్ 2) అర్ధరాత్రి అద్దంకిలోని మేదరమెట్ల సెంటర్‌లో షార్ట్‌సర్క్యూట్ (short Circuit) కారణంగా ఒక దుకాణంలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. పుస్తకాలు, బ్యాగులు, ఫ్యాన్సీ వస్తువులు అమ్మే ఈ దుకాణంలో నిల్వ చేసిన సరుకు మొత్తం కాలిపోయింది. విద్యా సంవత్సరం ప్రారంభం కావడంతో దుకాణ యజమాని పి. వాసు పెద్ద ఎత్తున స్టాక్ తెప్పించారు. సాధారణంగా దుకాణంలోనే నిద్రించే వాసు ఆ రోజు ఇంటికి వెళ్లారు. అర్ధరాత్రి షార్ట్‌సర్క్యూట్‌తో మంటలు చెలరేగడంతో స్థానికులు వాసుకు సమాచారం అందించారు. వెంటనే అద్దంకి అగ్నిమాపక కేంద్రానికి సమాచారం ఇవ్వడంతో అధికారి వెంకట్రావు సిబ్బందితో వచ్చి నాలుగు గంటలపాటు కష్టపడి మంటలను అదుపు చేశారు.

పొరుగు గృహాల వాసులు ఈ ప్రమాదంతో భయాందోళనకు గురయ్యారు. కానీ అగ్నిమాపక సిబ్బంది సకాలంలో చేరడంతో ఊపిరి పీల్చుకున్నారు. బుధవారం రోజంతా దుకాణంలో పొగలు కమ్ముకోవడంతో స్థానికులు ట్రాక్టర్ ట్యాంకర్‌తో నీళ్లు తెప్పించి చల్లార్చారు. దుకాణంలో ఉన్న వాసు పెంపుడు కుక్కలు తెలివిగా బాత్రూంలో దాక్కోవడంతో ప్రమాదం నుంచి బయటపడ్డాయి. అగ్నిమాపక సిబ్బంది వాటిని కాపాడారు. ఈ ఘటనలో సుమారు రూ.40 లక్షల విలువైన ఆస్తి నష్టం జరిగినట్లు వాసు తెలిపారు.

Next Story